అన్వేషించండి

Seethakka Legal Notices: కేసీఆర్‌కు సీతక్క లీగల్ నోటీసులు - క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక -అసలేమయిందంటే?

Minister Seethakka: మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు.

Minister Seethakka sends legal notices to  CM KCR:  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు.  అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఆ పోస్టులను 48 గంటల్లోగా తొలగించి, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్ ,  క్రిమినల్ చర్యలు తప్పవని మంత్రి తన లీగల్ నోటీసులో స్పష్టం చేశారు.

అసలు ఈ వివాదానికి కారణం బీఆర్ఎస్ నేత  మన్నె క్రిషాంక్ చేసిన ఆరోపణలు. అంగన్‌వాడీలకు ఫోన్ల పంపిణీలో దాదాపు రూ. 30 కోట్ల మేర కుంభకోణం జరిగిందని క్రిషాంక్ ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో రూ. 7 వేలకు లభించే ఫోన్లను, ప్రభుత్వం రూ. 14 వేలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిందని, ఇది మంత్రి సీతక్క కనుసన్నల్లోనే జరిగిందని ఆయన విమర్శించారు. ఈ మేరకు కొన్ని ఫోటోలు, ధరల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు.    

మంత్రి సీతక్క ఈ ఆరోపణలను అసంబద్ధమైనవిగా కొట్టిపారేశారు. అసలు మొత్తం టెండర్ విలువే రూ. 44 కోట్లు అయితే, అందులో రూ. 30 కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. ఈ కొనుగోలు ప్రక్రియ మొత్తం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్  ద్వారా పారదర్శకంగా జరిగిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చారని వివరించారు. ఈ ప్రక్రియతో తనకేమీ సంబంధం లేదని, కేవలం తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకే బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని నోటీసులో పేర్కొన్నారు.  

మంత్రి లీగల్ నోటీసు పంపిన తర్వాత బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ తనదైన శైలిలో స్పందించారు. తాము పంపిన ఆధారాలు చూసి భయపడి లీగల్ నోటీసుల వెనక దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము చేసిన ఆరోపణలు వాస్తవమని, కోర్టులోనే అన్ని ఆధారాలు బయటపెడతామని ధీమా వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని ఆయన  స్పష్టం చేశారు. 

ప్రస్తుతం ఈ వ్యవహారం ముదిరి కోర్టు మెట్లెక్కేలా కనిపిస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ తన ఆరోపణలను నిరూపించలేకపోతే, ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు, కోర్టు విచారణలో నిజంగానే లోపాలు జరిగాయని తేలితే సీతక్క రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా, ఒక సీనియర్ మంత్రి నేరుగా విపక్ష అధినేతకే నోటీసులు పంపడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

టాప్ హెడ్ లైన్స్

Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget