అన్వేషించండి

Revanth Reddy letter to Modi: మహిళా రిజర్వేషన్‌కు మద్దతు.. డీ లిమిటేషన్ కు కాదు.. ప్రధాని మోదీకి రేవంత్ లేఖ

Delimitation: మహిళా రిజర్వేషన్ల ముసుగులో డీలిమిటేషన్ చేయడాన్ని రేవంత్ వ్యతిరేకించారు. మహిళా కోటాను స్వాగతిస్తామన్నారు. ఈ మేరకు మోదీకి బహిరంగలేఖ రాశారు.

Revanth opposed delimitation:    మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం సరికాదని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి సమగ్రమైన లేఖ రాశారు. మహిళా కోటాకు దేశవ్యాప్తంగా మద్దతు ఉందని, దీనిని రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాల్లో తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు. అయితే, దీనిని సాకుగా చూపి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునర్విభజన చేయడం వల్ల దక్షిణాది , చిన్న రాష్ట్రాలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధి పథంలో నడుస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గడం వల్ల దేశ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేవలం జనాభా నిష్పత్తిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ నమూనాలను పరిశీలించాలని ఆయన సూచించారు. దేశ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాల కంటే మిన్న అని, ఏకపక్ష నిర్ణయాలు కాకుండా జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని కోరారు. 

ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గితే అది దీర్ఘకాలంలో దేశ సమగ్రతకు ముప్పుగా మారుతుందని రేవంత్ రెడ్డి తన లేఖలో విశ్లేషించారు. లోక్‌సభలో ప్రస్తుతమున్న ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూనే మార్పులు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ముందడుగు వేయాలని ప్రధానిని కోరారు.

లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం మేర పెంచాలనే ప్రతిపాదనలపై స్పందిస్తూ, ఇది ఉత్తర మరియు దక్షిణాది రాష్ట్రాల మధ్య సీట్ల అంతరాన్ని మరింత పెంచుతుందని రేవంత్ రెడ్డి గణాంకాలతో వివరించారు. ఈ వివక్ష వల్ల దక్షిణాది రాష్ట్రాలు జాతీయ రాజకీయాల్లో అట్టడుగున పడిపోయే అవకాశం ఉందని, దీనిని నివారించడానికి పారదర్శకమైన విధానాన్ని అనుసరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ లేఖపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో  రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు.    ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమం చేయనుంది. ఈ ఉద్యమంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.                                                          

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget