అన్వేషించండి

Minister KTR: నేను వెళ్లిపోయినా కొప్పుల ఈశ్వర్ కేసీఆర్‌తోనే ఉంటా అన్నడు - కేటీఆర్

Minister KTR: ధ‌ర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

Minister KTR: ధ‌ర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ధ‌ర్మపురి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌నలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ధ‌ర్మపురి పేరులోనే ధ‌ర్మం ఉందని.. ఓటులోనూ ధ‌ర్మం ఉండాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని, అప్పుడే ధ‌ర్మం ఉన్నట్లు లెక్క అన్నారు. చ‌ల్లటి మ‌నిషి, సౌమ్యుడు, మృదుస్వభావి కొప్పుల అని అన్నారు. 

కొప్పల రాజకీయ ప్రస్థానం గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ ఈశ్వరన్న లాంటి సౌమ్యుడు రాజ‌కీయాల్లో ఇంత దూరం, ఇంత ఉన్నత స్థానానికి రావ‌డం మామూలు విష‌యం కాదు. త‌న కేరీర్ చూస్తే 1976, న‌వంబ‌ర్‌లో 17 ఏండ్ల వ‌య‌సులో సింగ‌రేణిలో ప‌ని చేయ‌డం ప్రారంభించారు. దాదాపు 26 ఏండ్లు సింగ‌రేణిలో ప‌ని చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఒక పేద కుటుంబం నుంచి వ‌చ్చి, కార్మికుడిగా జీవితం మొద‌లుపెట్టి.. 22 ఏండ్ల కింద‌ట కేసీఆర్‌తో త‌మ్ముడిలా అటాచ్ అయిన త‌ర్వాత.. ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కు ఉద్యమంలో ఎత్తులు ప‌ల్లాలు చూశారు. గెలిచినా, ఓడినా కేసీఆర్‌కు ఒక త‌మ్ముడిలా, నిబద్ధత క‌లిగిన సైనికుడిలా క‌లిసిమెలిసి ఉన్నారు’ అని కేటీఆర్ కొనియాడారు.

‘కేటీఆర్, హరీష్ రావు వెళ్లినా నేను ఉంటా అన్నడు’
తాను కొప్పుల ఈశ్వర్‌కు ఫ్యాన్ అయిపోయాను అని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. 2009 ఎన్నిక‌ల్లో 46 సీట్లలో పోటీ చేస్తే కేవ‌లం 10 స్థానాల్లో గెలిచామని, కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చిందన్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం అయ్యాక ఒకటే టీవీలు, పేపర్లలో ఒక‌టే స్టేట్‌మెంట్లు అని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పోతున్నారంటూ ప్రచారం చేశారని, తెలంగాణ ఉద్యమాన్ని గొంతు నులిమి చంపే ప్రయ‌త్నం చేశారని అన్నారు. కానీ కొప్పుల ఈశ్వర్ మాత్రం పార్టీ  మారలేదని, ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. కేసీఆర్‌తో ఇవాళ ఉన్నానని, రేపు ఉంటానని, చ‌చ్చేదాకా ఉంటానని కొప్పుల చెప్పారని అన్నారు. ఒక వేళ ఏదైనా ప‌రిస్థితుల్లో కేటీఆర్, హ‌రీశ్‌రావు ఇద్దరూ విడిచిపెట్టి పోయినా నేను మాత్రం కేసీఆర్‌తోనే ఉంటాన‌ని చెప్పారని గుర్తు చేసుకున్నారు.

‘చెరువు నిండిన తరువాత కప్పలు మస్త్ వస్తయ్’
మనం క‌ష్టంలోనే ఉన్నప్పుడు మ‌నోడు ఎవ‌డో.. మందోడు ఎవ‌డో తెలుస్తందని కేటీఆర్ అన్నారు. చెరువు నిండిన త‌ర్వాత క‌ప్పలు మ‌స్తు వ‌స్తాయన్నారు. గ‌ర్వంగా చెబుతున్నానని.. ఈశ్వర‌న్న లాంటి నాయ‌కులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. ఆయ‌న‌తోటి ఒక్క పంచాయితీ ఉండ‌దని. ఎవ‌రితోనూ కొట్లాట ఉండ‌దని, న‌వ్వుతూ మాట్లాడతారని అన్నారు. ప‌ద్ధతిగా, విన‌యంగా, మ‌ర్యాద‌గా అంద‌రిని ద‌గ్గరికి తీసుకొనే వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్నారు. 

ధ‌ర్మపురి అభివృద్ధికి కొప్పుల నిర్విరామంగా పని చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ధ‌ర్మపురిని మున్సిపాలిటీ కూడా చేసుకున్నామని, మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 13 ర‌కాల లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను రూ. వంద‌ల కోట్లతో నిర్మాణం జ‌రిగిందని, 40 వేల ఎక‌రాలు ఉన్న ఆయ‌క‌ట్టును ల‌క్షా 26 వేల ఎక‌రాల‌కు ఆయ‌క‌ట్టు తీసుకెళ్లారని అన్నారు. వెలగటూరులో వ్యవ‌సాయ కాలేజీ రాబోతోందని చెప్పారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ ఈశ్వర‌న్నను చీఫ్ విప్‌గా కేబినెట్ ర్యాంకులో పెట్టుకున్నారని, రెండో ట‌ర్మ్‌లో కేబినెట్ మంత్రిగా తీసుకున్నారని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Embed widget