Adilabad News: ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతి వనం ప్రారంభం -మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Indravelli: ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతి వనం ప్రారంభం అయింది. మంత్రి జూపల్లి ఈ స్మృతి వనాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు.

Memorial garden inaugurated at Indravelli Martyrs Monument: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోరాట స్ఫూర్తికి, విప్లవానికి గుర్తంపుగా ఉన్న ఇంద్రవెల్లి వద్ద స్మృతి వనాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. దళిత గిరిజన దండోరా సభలో నాడు పీసీసీ చీఫ్ హోదాలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరులను ఆదుకుంటామని మాటిచ్ejg.నేడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. అంతకు ముందు అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ పార్టీ మాటిస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటుందని మంత్రి జూపల్లి అన్నారు. అమరుల యాదిలో 1కోటి రూపాయలతో స్మృతి వనం ఏర్పాటు చేశామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ట్రైకార్ ద్వారా 10 లక్షల రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 8 మంది అమరవీరుల కుటుంబాలకు ట్రైకార్ ద్వారా మంజూరైన 10లక్షల విలువ గల ట్రాక్టర్లు అందజేశారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చుతున్నామని, అర్హులైన లబ్బిదారులకు ఇందిరమ్మ ఇళ్ళను అందిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి 250కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఇళ్లను నిర్మించుకోవాలన్నారు. లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
చట్ట ప్రకారమే అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామనీ, అవకతవలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా తనకు సంప్రదించాలని 9848014089 ఈ ఫోన్ నెంబర్ సైతం ఇచ్చారు. బోథ్ నియోజకవర్గంలో ఇదే విషయం తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని అన్నారు. కానీ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. అధికారులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దని సూచించారు.
గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా నేడు ప్రజా ప్రభుత్వం 6వేల కోట్ల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. ప్రజా ప్రభుత్వ హయంలో చరిత్రాత్మకమైన పథకాలను ప్రజలకు అందిస్తున్నామని, గంజాయి మీద ఉక్కు పాదం మోపుతున్నామని, యువత గంజాయికి దూరంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రోడ్డు నిర్మాణ పనులకు ఇసుక తీసుకెళ్ళే వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని, పోలీస్, ఫారెస్ట్ అధికారులకు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇసుక విషయంలో అమాయక ప్రజలపై కేసులు పెట్టొదని ఆదేశించారు.





















