(Source: ECI/ABP News/ABP Majha)
Medaram Priest: మేడారం జాతర పూజారి కన్నుమూత, ఆదివాసీల్లో తీవ్ర విషాదం
Medaram Jatara Priest Dies: గిరిజన వేడుక మేడారం జాతర పూజారి దశరథం కన్నుమూశారు. ఇటీవల జరిగిన సమ్మక్క సారక్క జాతర పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.
మేడారం: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన వేడుక మేడారం జాతర పూజారి కన్నుమూశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర సమ్మక్క పూజారి అయిన సిద్ధమైన దశరథం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర ఘనంగా నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమాల్లో సమ్మక్క పూజారి అయిన దశరథం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న పూజా దశరథం మంగళవారం తుదిశ్వాస విడిచారు. పూజారి మృతితో ఆదివాసీల్లో విషాదం నెలకొంది. మేడారం భక్తులు సైతం పూజారి దశరథం మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
2023 అక్టోబర్‌లో ప్రధాన పూజారి కన్నుమూత
మేడారం మహా జాతర ప్రధాన పూజారి సిద్దబోయిన లక్ష్మణ్‌రావు (45) 2023 అక్టోబర్‌లో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అక్టోబర్ మొదటి వారంలో వేకువజామున మృతి చెందారు. లక్ష్మణ్‌రావు స్వస్థలం తాడ్వాయి మండలం మేడారం. లక్ష్మణ్ రావు తన 20వ ఏట నుంచి మేడారం జాతరకు సేవలు అందిస్తున్నారు. మేడారంలో మెుత్తం 11 మంది ప్రధాన పూజారుల్లో లక్ష్మణ్‌రావు ఒకరు. కానీ అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే పూజారి కన్నుమూశారు.