అన్వేషించండి

గులాబీమయమైన నాందేడ్, సభ సక్సెస్ అంటున్న బీఆర్ఎస్ వర్గాలు

నాందేడ్ సభ సక్సెస్ అయిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మహారాష్ట్రలో BRS నిర్వహించిన రెండో బహిరంగ సభ విజయవంతమైంది. నాందేడ్ జిల్లా కాంధార్ లోహలో జరిగినసభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలివచ్చారు.  సభ నేపథ్యంలో కంధార్, లోహ పట్టణాలు గులాబీమయమయ్యాయి. తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను.. అక్కడి వారి మరాఠా భాషలో  వీడియో డాక్యుమెంటరీల రూపంలో ప్రదర్శించారు.

దారి పొడవునా మరాఠా ప్రజల అభివాదం

హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వెలుతున్న సీఎం కాన్వాయ్‌కి  మూడు కిలోమీటర్ల మేర దారిపొడవునా నిలబడి అభివాదం చేస్తూ కేరింతలు కొట్టారు. గులాబీ రంగు పేపర్లు చల్లి అభిమానాన్ని చాటుకున్నారు. సెల్ ఫోన్లలో కేసీఆర్ ని వీడియో తీసుకోవడానికి పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి బస్ లో నుండి ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అభివాదం చేస్తూ వెళ్ళారు. కేసీఆర్ సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సభా స్థలిలో ప్రజలు లేచి నిలబడి అభివాదం చేశారు.  

మరాఠా మహనీయులకు ఘన నివాళి :

సభా వేదికకు చేరుకున్న సీఎం కేసీఆర్, వేదికమీద ఏర్పాటు చేసిన మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అన్నాబాహు సాథే, మహాత్మా ఫూలే, అహల్యాబాయి హోల్కర్  విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

బహిరంగ సభలో.. ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీలు, మధుసూదన చారి, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, షకీల్ అహ్మద్, బిఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్, బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హిమాంశు తివారి, ఒడిషా బిఆర్ఎస్ నాయకుడు అక్షయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే దీపక్ అథ్రమ్, మాజీ ఎంపి హరిబన్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరినవారు ఎవరంటే..

మాజీ ఎమ్మెల్యే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు, శంకరన్న ధోండ్గే, మాజీ ఎంపి హరిభావ్ రాథోడ్, , మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వసంత రావు బోండే, ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాగ్ నాథ్ ఘిసేవాడ్, ఎమ్మెల్యేగా పోటీచేసిన దళిత నాయకుడు సురేష్ గైక్వాడ్, ఎంపీగా పోటీచేసిన యశ్ పాల్ భింగే, ఎమ్మెల్యేగా పోటీ చేసిన జకీర్ చావ్స్, మాజీ జెడ్పీ ప్రహ్లాద్ రొఖండో, దీపక్ అరవింద్ కాంతే తదితరులు సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.  

బీఆర్ఎస్‌లో చేరిన జిల్లా పరిషత్ స్థాయి నాయకులు వీళ్లే:

దత్తా పవార్, సంజయ్ పాటిల్ కర్హాలే, దిలీప్ దోండగే, సవిత వర్ఖాన్, విజయ్ ధోండగే, ప్రల్మాద్ ఫాస్గే, శివదాస్ ధర్మపురికర్, దత్తా కరముంగే, సునీల్ ధోండగే, షఫీ ఉల్లా బేగ్, వెంకట్ గైక్వాడ్, అజయ్ హంకరే తదితర జిల్లా పరిషత్ స్థాయి నాయకులు పార్టీలో చేరారు.

మాజీ  ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ హెలిప్యాడ్ నుంచి తొలుత కాంధార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించారు. నాందేడ్ జిల్లా బిఆర్ఎస్ నాయకులు, మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం కొబ్బరి కుడుకలతో కూడిన భారీ గజమాలతో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు.  

నిర్వాహకులను అభినందించిన కేసీఆర్

జన సమీకరణ చేసి, సభను విజయవంతంగా నిర్వహించిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, షకీల్, టిఎస్ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, బిఆర్ఎస్ నాయకులు అమృత్ లాల్ చౌహాన్, భాస్కర్ గుడాల, రాఘవను సీఎం కేసీఆర్ అభినందించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Embed widget