Congress MLC Race: కాంగ్రెస్‌లో కొత్త ఇంచార్జ్ ముందు డిమాండ్ల చిట్టా - ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని కుసుమకుమార్ డిమాండ్
Kusumakumar : కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ రేసు నడుస్తోంది. తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ డిమాండ్ చేస్తున్నారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జ్ వచ్చారు. ఈ క్రమంలో ఆమె ముందు తమ డిమాండ్లను చెప్పేందుకు కొంత మంది నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ ఎమ్మెల్సీ పదవికి తాను అర్హుడినేనని ప్రకటించుకున్నారు. గాంధీభవన్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన తనతో పాటు పని చేసిన అందరు పెద్ద పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. మొదటి నుండి ఆర్గనైజేషన్ లో ఉన్న నన్ను పార్టీ గుర్తిస్తుంది అని భావిస్తున్నానన్నారు. కమ్మ కమ్యూనిటీ ghmc లో సింగల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని.. తనకు చాన్స్ ఇస్తే మేలు జరుగుతుందన్నారు.
మీనాక్షి నటరాజన్ తనను గుర్తిస్తారంటున్న కుసుమకుమార్
తెలంగాణ కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లాంటి నేత రావడం వల్ల తమ లాంటి నేతలకు మేలు జరుగుతుందన్నారు. కొత్త ఏఐసీసీ ఇంచార్జ్ గా ఎవరైనా వస్తే ఫ్లెక్సీలతో నిండి పోయేవి కానీ ఇప్పుడు అలాంటివి లేవన్నారు. సాదా సీదా వ్యక్తి మీనాక్షి నటరాజన్ అని.. పార్టీ లో పనిచేసినవారికి సముచిత స్థానం ఉంటుందని భావిస్తున్నానన్నారు.ఎమ్మెల్సీ అడగడం తన హక్కు అన్నారు. దోమల గూడ av కాలేజ్ లో సీఎం నేను కలిసి డిగ్రీ చేశామని.. సీఎం నేను బ్యాచ్ మేట్స్ ఒకటే క్లాస్ ఒకటే బెంచ్ అన్నారు. ఇద్దరం ఒకటే సారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశామన్నారు.
కమ్మ సామాజికవర్గం వారికి అవకాశం ఇస్తే మేలని సూచన
గ్రేటర్ లో 25లక్షల మంది కమ్మ సామాజిక వర్గం వారు ఉంటారు. హైదరాబాద్ ఖమ్మం నిజామాబాద్ లో ఎక్కువగా ఉన్నారన్నారు. 4 .50 లక్ష మంది ghmc పరిధిలో ఉన్నారుని.. Ghmc లో కమ్మ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉందన్నారు. తనతో పని చేసిన వారు పెద్ద పదవుల్లో ఉన్నారని.. తాను మాత్రం వెనుకబడి ఉన్నానన్నారు. కుసుమకుమార్ కు మద్దతుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందని చెప్పారు.
ఎమ్మెల్సీ సీట్ల కోసం భారీ రేస్
తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ వెలువడింది. బలాలను బట్టి కాంగ్రెస్ పార్టీకి మూడు దక్కుతాయి. మజ్లిస్ సహకారంతో నాలుగో స్థానం కూడా దక్కే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి లభిస్తుంది. కాంగ్రెస్ కు లభించే మూడు స్థానాల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. కొంత మంది బహిరంగంగా చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ తమ పేర్లను కూడా పరిశీలించాలని సంకేతాలు పంపుతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి నటరాజన్ ఇంచార్జ్ గా రావడంతో ఆమె సిఫారసులు కూడా కీలకమని భావిస్తున్నారు. అందుకే ఆమెకు తమ సిన్సియారిటీ.. పార్టీ కోసం పడిన కష్టాన్ని చెప్పుకునేందుకు ప్రాధన్యం ఇస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

