అన్వేషించండి

KTR Padayatra : కేటీఆర్ పాదయాత్ర - బీఆర్ఎస్ నెక్ట్స్ ప్లాన్ ఇదేనా ?

BRS : బీఆర్ఎస్ బలోపేతం కోసం కేటీఆర్ పాదయత్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసుకోవడానికి విపక్షంలో ఉన్న పార్టీల కీలక నేతలు పాదయాత్ర చేయడం ఓ ట్రెండ్ గా వస్తోంది.

KTR is Planning For Padayatra :   భారత రాష్ట్ర సమితిని మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన పాదయాత్ర చేస్తారనే ప్రచారం జరుగుతోంది.   త్వరలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను కలుపుతూ కేటీఆర్ పాదయాత్ర చేస్తారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ఓటమి బాధలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కొంత మంది పార్టీలు వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కు భారీ యాక్టివిటీ ఉండాలని.. కీలక నేతలు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్ లో ఉంది.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్ర ఓ ట్రెండ్                                 

ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర పెద్ద అస్త్రం . ప్రతి సారి ఎన్నికల సీజన్ కు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేకర్ రెడ్డి, చంద్రబాబు, జగన్, షర్మిల , లోకేష్ వరకూ పాదయాత్రలు చేశారు. వారు పాదయాత్రలు చేసినప్పుడల్లా మంచి ఫలితాలు సాధించారు. అయితే షర్మిల మాత్రం రెండు సార్లు పాదయాత్రలు చేసినా ప్రయోజనం పొందలేకపోయింది. 

అందరికీ కలసి రాని పాదయాత్రలు               
 
అయితే అది అందరికీ వర్కవుట్ అయ్యే సూచనలు లేవు. షర్మిల తెలంగాణ మొత్తం పాదయాత్ర చేశారు కానీ.. కనీసం తనకైనా డిపాజిట్ వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి .. తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయిపోయారు.  బీజేపీ నేత  బండి సంజయ్ కూడా విడతల వారీగా పాదయాత్ర చేశారు  కానీ  కీలక సమయంలో  ఆయనను టీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించడంతో  పాదయాత్ర  ఆగిపోయింది.  బీజేపీ కూడా మంచి ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించలేకపోయింది.   ఏపీలో నారా లోకేష్ చేసిన యవగళం పాదయాత్ర టీడీపీకి అధికారాన్ని దగ్గర చేసిందని అనుకోవచ్చు. 

కేటీఆర్ పాదయాత్ర బెటర్ అనే ఆలోచనలో బీఆర్ఎస్ క్యాడర్                              

ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న గడ్డు పరిస్థితుల్లో కేటీఆర్ కూడా పాదయాత్ర చేయాలని ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటోంది.  పాదయాత్రలు చేస్తే మంచి ఫలితాలు వచ్చిన చరిత్ర ఉండటంతో కేటీఆర్ కూడా అదే తరహాలో పాదయాత్ర చేస్తే  బాగుంటుందని బీఆర్ఎస్ క్యాడర్ ఆలోచన. అందుకే ఆయనపై ఒత్తిడి పెంచేందుకు సోషల్ మీడియా ద్వారా  ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.  కానీ ఇప్పుడే అలాంటి ప్రయత్నాలు చేయలేమని.. ఎన్నికలకు ఏడాది లేదా ఏడాదిన్నర ముందు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం కవిత బెయిల్ పిటిషన్లపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కేటీఆర్ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు.        

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
 గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hotstar January Watchlist: హాట్‌స్టార్‌లో జనవరిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్... డేట్స్, పూర్తి వివరాలు
హాట్‌స్టార్‌లో జనవరిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్... డేట్స్, పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP DesamBhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
 గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hotstar January Watchlist: హాట్‌స్టార్‌లో జనవరిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్... డేట్స్, పూర్తి వివరాలు
హాట్‌స్టార్‌లో జనవరిలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్... డేట్స్, పూర్తి వివరాలు
Traffic Rules: నంబర్ ప్లేట్ మూసేసినా చలాన్ - టెక్నాలజీ వాడుతున్న ట్రాఫిక్ పోలీసులు!
నంబర్ ప్లేట్ మూసేసినా చలాన్ - టెక్నాలజీ వాడుతున్న ట్రాఫిక్ పోలీసులు!
Nagoba Jatara 2025: జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
Rohit Sharma and Virat Kohli: గేమ్‌ ఛేంజర్స్‌ కాదు గేమ్‌ డ్యామేజర్స్‌- రోహిత్‌, విరాట్‌పై పెరుగుతున్న అసహనం
గేమ్‌ ఛేంజర్స్‌ కాదు గేమ్‌ డ్యామేజర్స్‌- రోహిత్‌, విరాట్‌పై పెరుగుతున్న అసహనం
Rohit Sharma: ఐదో టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్, టీమిండియా కెప్టెన్ పేరిట చెత్త రికార్డు! - క్లారిటీ ఇచ్చిన బుమ్రా
ఐదో టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్, టీమిండియా కెప్టెన్ పేరిట చెత్త రికార్డు! - క్లారిటీ ఇచ్చిన బుమ్రా
Embed widget