Komaram Bheem: పచ్చి బాలింతను అడవిలో వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. కారణం ఏంటంటే..
రోడ్డు సరిగ్గా లేదని 102 అంబులెన్స్ సిబ్బంది పచ్చి బాలింతను అడవిలోనే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ బాలింతరాలు మూడు కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరింది.
మారుమూల ప్రాంతాల్లో రహదారులు లేక అక్కడి జనం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో కూడా ఊరు దాటాలంటే ప్రయాసపడాల్సి వస్తోంది. తాజాగా కొమరం భీం జిల్లాలోని ఏజెన్సీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు సరిగ్గా లేదని 102 అంబులెన్స్ సిబ్బంది పచ్చి బాలింతను అడవిలోనే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ బాలింతరాలు మూడు కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరింది. ఈ ఘటన అత్యంత అమానవీయ ఘటన పెంచికల్‌పేట మండలం మురళీగూడలో చోటు చేసుకుంది.
కవిత అనే నిండు గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో ఆమె కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు ప్రసవం చేయగా.. పండంటి ఆడపిల్ల జన్మనిచ్చింది. సాధారణ ప్రసవం కావడంతో డాక్టర్లు త్వరగానే డిశ్చార్జి చేశారు. అయితే, ఆస్పత్రి నుంచి తన సొంత ఊరికి వెళ్లేందుకు అంబులెన్స్‌ను కేటాయించారు. ఇంటికి వెళ్లేందుకు 102 అంబులెన్స్‌లో ఆమెను తీసుకెళ్తుండగా.. కొంత దూరం వచ్చిన తర్వాత రోడ్డు బాగాలేదని అంబులెన్స్ డ్రైవర్ నిలిపివేశాడు.
Also Read: Hyderabad Crime: 2 కిలోల నగల బ్యాగుతో బస్సెక్కిన వ్యక్తి.. హైదరాబాద్ వచ్చేసరికి భారీ షాక్
Also Read: Indira Park: ‘మనం అఫ్గాన్‌లో ఉన్నామా? హైదరాబాద్‌లోనా?’ ఇందిరా పార్కు తీరుపై నిరసన, చివరికి యూటర్న్
ఇక తాను ముందుకు పోలేనని తేల్చి చెప్పేశాడు. దీంతో బాలింతతో పాటు ఆమె వెంట ఉన్న కుటుంబ సభ్యులు కూడా అక్కడే దిగిపోయారు. అంబులెన్స్ డ్రైవర్ వెనక్కి వెళ్లిపోయాడు. గతి లేక వీరంతా బాలింత పసికందును ఎత్తుకుని నడుచుకుంటూ తమ ఊరికి వెళ్లారు. దాదాపు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఇంటికి చేరారు. ఇలా బాలింతను నడిపించిన ఘటన బయటికి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమను అంబులెన్స్ సిబ్బంది డబ్బులు అడిగారని, లేవని చెప్పడంతో మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపణ చేస్తున్నారు.
Also Read: RS Praveen Kumar: ఏ క్షణానైనా తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయొచ్చు.. ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు
Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి అంత మాట అనేశారే.. రేవంత్ రెడ్డిపై అసంతృప్తే కారణమా?