Indira Park: ‘మనం అఫ్గాన్‌లో ఉన్నామా? హైదరాబాద్‌లోనా?’ ఇందిరా పార్కు తీరుపై నిరసన, చివరికి యూటర్న్
ఇందిరా పార్కు నిర్వహకులు పెళ్లికాని జంటలు రావొద్దని కొద్ది రోజుల క్రితం ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా.. వివిధ వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదురైంది.
హైదరాబాద్‌లోని ఇందిరా పార్కులోనికి పెళ్లికాని జంటలు రావొద్దని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది. పార్కు నిర్వహకులు కొద్ది రోజుల క్రితం ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా.. వివిధ వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదురైంది. ఇదెక్కడి నిబంధన అంటూ మహిళా సంఘాల కార్యకర్తలు, పౌర సమాజ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమెన్స్ కలెక్టివ్ నిర్వహకురాలు కొండవీటి సత్యవతి సోషల్ మీడియా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని నిలదీశారు. వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో ఆ ఫ్లెక్సీని పార్కు నిర్వహకులు తొలగించారు.
‘‘తాలిబాన్ ఎక్కడో వేరే దేశంలో లేరు, మన చుట్టూనే ఉన్నారు.. కావాలంటే హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్కుకి వెళ్లి చూడండి. మనం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా హైదరాబాదులో ఉన్నామా తాలిబాన్ల పాలనలో ఉన్నామా? చెత్త తీయాల్సిన జీహెచ్ఎంసీ ఆ పని సక్రమంగా చేయకుండా ఇలాంటి చెత్త పనుల్ని ఎందుకు చేస్తుందో అడగండి. వెంటనే ఈ బోర్డుల్ని అన్ని పబ్లిక్ పార్కుల నుండి తొలగించాలి’’ అని కొండవీటి సత్యవతి ఫేస్‌బుక్ వేదికగా ప్రశ్నించారు.
Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి అంత మాట అనేశారే.. రేవంత్ రెడ్డిపై అసంతృప్తే కారణమా?
పెళ్లైన జంటలను మాత్రమే పార్కులోకి అనుమతిస్తామనడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19డి, 19ఈ ప్రకారం ఫ్రీడం ఆఫ్ మూమెంట్‌ను హరించడమే అవుతుందని సామాజిక కార్యకర్త తోట రాంబాబు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర చేష్టలు చట్ట విరుద్ధం. అశ్లీలకరమైన పనులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవచ్చు. అంతేకానీ, ఎక్కడో అలాంటి ఘటనలు జరుగుతున్నాయనే కారణంతో ఇలాంటి నిబంధన విధించడం సరికాదని ఆయన అన్నారు.
Also Read: Nirmal News: భార్య చేసిన ఆ తప్పు భర్తను చంపేసింది.. బంధువులున్నా అనాథల్లాగా మారిన పిల్లలు
వెలవెలబోయిన పార్కు
కొత్తగా ఫ్లెక్సీ పెట్టడంతో మూడు రోజులుగా ఇందిరాపార్కుకు పెళ్లి కాని జంటలను అనుమతించలేదు. ఇక్కడకు వచ్చిన ప్రేమ జంటలు పార్కులోకి ఎందుకు అనుమతి ఇవ్వరంటూ సిబ్బందితో గొడవలకు సైతం దిగారు. తాజాగా అక్కడ ఫ్లెక్సీ తొలగించడంతో పాటు గురువారం ప్రేమ జంటలకు కూడా పార్కులోకి అనుమతించారు.
Also Read: High Court News: భార్యతో అలా శృంగారం చేస్తే రేప్‌గా పరిగణించలేం.. ఛత్తీస్ గఢ్ హైకోర్టు తీర్పు
Also Read: Hyderabad Crime: 2 కిలోల నగల బ్యాగుతో బస్సెక్కిన వ్యక్తి.. హైదరాబాద్ వచ్చేసరికి భారీ షాక్