అన్వేషించండి

Loan Waiver Guidelines: తెలంగాణలో రైతు రుణమాఫీ - మార్గదర్శకాలపై కీలక అప్ డేట్ ఇదే!

Telangana News: తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాల జారీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా గైడ్ లైన్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

Key Update On Telangana Loan Waiver Guidelines: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే తెలంగాణలో రైతులకు రుణ మాఫీ (Farmer Loan Waiver) చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల కేబినెట్ భేటీలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రూ.2 లక్షల రుణ మాఫీకి సంబంధించి అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2023, డిసెంబర్ 9కి ముందు రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తింపచేస్తామని చెప్పారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా రైతుల సమక్షంలోనే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, నాలుగు రోజుల్లో రుణమాఫీ విధి విధానాలు విడుదల చేస్తామని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గైడ్ లైన్స్‌పై ఫోకస్

అటు వ్యవసాయ శాఖ అధికారులు, ఇటు ఆర్థిక శాఖ అధికారులు గైడ్ లైన్స్ రూపకల్పనపై కుస్తీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రుణమాఫీ విధి విధానాల రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇందుకు రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో పలువురు అధికారులు పర్యటించి గైడ్ లైన్స్‌పై అధ్యయనం చేశారు. కేంద్రం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ పథకం రూల్స్ రుణమాఫీకి వర్తింపచేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు, ఐటీ చెల్లించే వారిని రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కచ్చితంగా రుణమాఫీ జరిగేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.

నిధుల సమీకరణపై ఫోకస్

రుణ మాఫీ మార్గదర్శకాల విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో పథకం అమలుకు సంబంధించి నిధుల సమీకరణపైనా ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటే ఇతర మార్గాలను కూడా చూస్తున్నట్లు సమాచారం. 

'వారం రోజుల్లో ప్రక్రియ ప్రారంభం'

అటు, వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన సోమవారం ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల అన్నదాతలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రుణమాఫీతో ప్రభుత్వంపై రూ.31 వేల కోట్ల భారం పడుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్నారని ప్రశంసించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

Also Read: IPS Transfers: తెలంగాణలో మరో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ, సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget