By: ABP Desam | Updated at : 10 Jan 2023 02:57 PM (IST)
ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్
BRS Khammam Meeting: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీగా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఈ నెల 18న ఖమ్మంలో జరగనుంది. ఈ బహిరంగ సభను హిట్ చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR).. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, వ్యూహాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో చర్చించారు. సభపై దేశవ్యాప్తంగా ఫోకస్ పడేందుకు కొన్ని రాష్ట్రాల సీఎంలను కూడా కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లుగా తెలిసింది. అందులో భాగంగా ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎంను సభకు పిలుస్తున్నట్లుగా సమాచారం.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఖమ్మం సభకు హాజరుకానున్నట్లు సమీక్షలో చెప్పుకున్నట్లు తెలిసింది. వీరు ముందుగా ప్రగతి భవన్‌కు చేరుకుంటారని, కేసీఆర్‌తో చర్చల అనంతరం ఆయనతో పాటే హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. సభా వేదికపై రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అతిథులుగా హాజరయ్యే ముగ్గురు సీఎంలలో ఒకరితో ప్రారంభించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
సీఎంతో భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధుసూదన్, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, బానోతు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్ లింగాల కమల్ రాజ్ వంటివారు పాల్గొన్నారు.
జనాన్ని బాగా రప్పించాలని ఆదేశాలు
ఖమ్మం బీఆర్ఎస్ తొలి సభకు కో ఆర్డినేటర్‌గా మంత్రి హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. భారీగా జనాల్ని సభకు రప్పించడం, సభా వేదిక ఏర్పాట్ల బాధ్యతను బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మరికొందరు ముఖ్య నేతలకు అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది. సభకు తెలంగాణతో పాటు ఏపీలోని సమీప గ్రామాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయాలనే యోచనలో కూడా సీఎం ఉన్నట్లు తెలిసింది.
ఉమ్మడి ఖమ్మం (Khammam District) జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పొరుగునే ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని పది నియోజకవర్గాలు కలిపి.. మొత్తంగా 20 నియోజకవర్గాల నుంచి ఐదు లక్షల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం లక్ష్యం విధించారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలు, మహబూబాబాద్, పాలకుర్తి, డోర్నకల్, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, ఇల్లందు, సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి 40 వేల మంది చొప్పున జన సమీకరణ చేయాలని సీఎం సూచించినట్లుగా సమాచారం.
అందుకోసం రూట్ మ్యాప్, పార్కింగ్, ఎన్ని వాహనాలు అవసరం? ఆ ప్రాంతంలో ఎన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయి, ట్రాఫిక్ జామ్, మళ్లింపు వంటి అంశాలపైనా నేతలు మాట్లాడుకున్నారు.
TSLPRB: ఆ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీలక నిర్ణయం! ఏంటంటే?
Breaking News Live Telugu Updates: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Revanth Reddy Comments: ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ల మీద పడింది మరిచావా కేసీఆర్?: టీపీసీసీ చీఫ్
Global EduFest 2023: ఫిబ్రవరి 10న 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023' నిర్వహిస్తున్న ఐఎంఎఫ్ఎస్
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి