By: ABP Desam | Updated at : 17 Dec 2021 01:04 PM (IST)
ఉద్యమంలో కీలకంగా పని చేసిన వారికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సొంత పార్టీలో అసంతృప్తులపై దృష్టి పెట్టారు. అందరికీ వీలైనంత వరకు ప్రాధాన్యం కల్పించి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నామినేటెడ్ పోస్టులభర్తీ ప్రక్రియను చురుగ్గా ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను ఎనిమిదింటిని మూడు రోజుల్లోభర్తీ చేశారు. అన్నీ .. పార్టీ కోసం పని చేసిన వారు.. ఉద్యమంలో చురుగ్గా ఉన్న వారికే కేటాయించారు. గతంలో ఇచ్చిన హమీలు... ముందు ముందు అవసరాలు చూసుకుని మరీ ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
Also Read: తెలంగాణలో కారుతో పొత్తుకు కామ్రెడ్లు సిద్ధమే..! వ్యూహాలు అమలు చేస్తున్న నేతలు
మూడు రోజుల కింట ముగ్గురు యువ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. తాజాగా ఐదు రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ తరపున గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అయితే ముందుగా హామీ ఇచ్చిన ప్రకారం ఎమ్మెల్సీ ఇవ్వలేకపోవడంతో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తున్న గజ్జెల నగేష్‌కు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా , పాటిమీది జగన్మోహన్ రావుకు .తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్" చైర్మన్ గా అవకాశం కల్పించారు. వీరు చాలా కాలంగా తమకు ప్రాధాన్యం దక్కుతుందేమోనని ఎదురు చూస్తున్నవారే.
Also Read: వరంగల్ కు జెన్పాక్ట్ ఐటీ కంపెనీ... మంత్రి కేటీఆర్ తో జెన్పాక్ట్ బృందం భేటీ...
.తెలంగాణ సాహిత్య అకాడమీ" చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్‌ను నియమించారు. తెలంగాణ సాహిత్య ప్రపంచంలో గౌరశంకర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన టీఆర్ఎస్ కోసం నేరుగా పని చేయలేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో సాహిత్య లోకాన్ని ఏకం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు సరైన గుర్తింపు రాలేదన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి లభించింది. తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్" చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను నియమించారు. పదవి కోసం ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ సీనియర్ నేతల్లో ఈయన ఒకరు.
Also Read: సోనియాతో డీఎస్ భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం !
టీఆర్ఎస్ కోసం పని చేసిన వారు.. తర్వాత వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్‌లో చేరిన వారు అనేక మంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే సుదీర్ఘ కాలంగా టీఆర్ఎస్‌లో ఉన్న వారు తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తిలో ఉన్నారు. ఇది ఇతర పార్టీలకు అవకాశంగా మారింది. తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని గాలం వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమ కాలం నుంచి ఉండి.. సరైన గుర్తింపు లేని వారిని ఆహ్వానిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఉద్యోగసంఘాల్లో కీలక పాత్ర పోషించి విఠల్‌తో పాటు మరికొంత మంది బీజేపీలో చేరిపోయారు. ఇంకొంత మంది చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. వీటికి చెక్ పెట్టడానికి కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభించినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ భర్తీ ఇలా కొనసాగుతుందని.. మరికొంత మందికి కీలకమైన పదవులు లభించబోతున్నాయని టీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతోంది.
Also Read: ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ.. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Komatireddy Wishes Revanth: సీఎంగా రేవంత్‌రెడ్డి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం- కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Trains Cancelled: మిగ్ జాం ఎఫెక్ట్ - ఈ రైళ్లు రద్దు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
/body>