17వ తేదీన రైల్ రోకోను వాయిదా వేసుకున్న కవిత - వారం రోజులు చూస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక
Rail Roko: బీసీ రిజర్వేషన్ల కోసం చేపట్టిన రైల్ రోకో ఉద్యమాన్ని కవిత వాయిదా వేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీసుకురానున్న ఆర్డినెన్స్ కు బీజేపీ ఆమోదం తీసుకు రావాలన్నారు.

Kavitha postpones rail roko movement: 17వ తేదీన జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన రైల్ రోకోను కవిత వాయిదా వేసుకున్నారు. బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించడంతో తాత్కలికంగా వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇవ్వాలని.. ఆర్డినెన్స్ పాస్ చేసేలా బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా రైల్ రోకో వాయిదా.. ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.
42 శాతం బిసి రిజర్వేషన్ల కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. డిల్లీకి వెళ్ళి బిజెపి, కాంగ్రెస్ మోసాన్నీ ఎండగట్టామని.. ఆర్డినెన్సు తీసుకువస్తామని ప్రభుత్వ నిర్ణయం జాగృతి విజయమన్నారు. ఆర్డినెన్సు తెచ్చేవాళ్ళు ఇన్నాళ్లు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. మేము తలపెట్టిన రైల్ రోకో ను వాయిదా వేస్తున్నాం.. ఆర్డినెన్సు ను గవర్నర్ ఆమోదించకపోతే మళ్ళీ పోరాటం ఉదృతం చేస్తామని ప్రకటించారు. కేబినెట్ రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ప్రస్తావించారు....విద్య, ఉద్యోగాల్లో మీ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
రైల్ రోకోకు వాయిదా - @RaoKavitha
— Meka Jayanth Yadav (@JayanthYadavBRS) July 11, 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసినందుకు గాను జులై 17న నిర్వహించాల్సిన రైల్ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్క గారు ప్రకటించారు.#Railroko pic.twitter.com/OOMbosL3T5
బీజేపీ నేతలు మీరు చేయాల్సింది చేయకుండా కాంగ్రెస్ ను మాత్రానే దోషిగా నిలబెడుతున్నారని.. బండి సంజయ్ ముందు ఉండి బీసీ బిల్లును 9 వ షెడ్యూల్ లో పెట్టించి రాజ్యాంగ సవరణ చేయించేలా కేంద్రాన్ని ఇప్పించాలిని కోరారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని.. వారం రోజుల పాటు ప్రభుత్వాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటామన్నరాు. ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేసి ఆర్డినెన్సు పై ముందుకు వెళ్లాలని.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందా లేదా అనేది వారంలో తెలిసిపోతుందన్నారు. లేదంటే మా పోరాటం ఉదృతంగా ఉంటుందని హెచ్చరించారు. చాలా రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ న్యూట్రల్ గా ఉండటం లేదుని.. ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం పెడితేనే మర్యాద ఉంటుంది. ఆయన పెడతారనే నమ్మకం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నం చేసిందని ఇక బీజేపీనే ఆ బాధ్యత తీసుకోవాలన్నట్లుగా కవిత మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. పైగా గవర్నర్ .. కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడంలేదని కూడా అంటున్నారు. ఆర్డినెన్స్ రాజ్యాంగవిరుద్ధంగా ఉంటే గవర్నర్ ఆమోదించే అవకాశం ఉండదు. అలా ఆమోదించకపోతే కవిత బీజేపీదే తప్పన్నట్లుగా మాట్లాడటంతో రాజకీయవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ముందు ముందు బీసీ రిజర్వేషన్ల రాజకీయం మరింత జోరుగా సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.





















