కరీంనగర్‌లో ఆపరేషన్ బంటి విజయవంతం- ఎలుగును బంధించిన అధికారులు
రాత్రి నుంచి కరీంనగర్‌లో ఎలుగుబంటి అధికారులను పరుగులు పెట్టించింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఊరిలోకి వచ్చిన ఎలుగు బంటి ఇళ్లల్లో దూరిపోతూ టెన్షన్ పెట్టింది.
అధికారులకు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఎలుగుబంటిని ఎట్టకేలకు బంధించారు. కరీంనగర్‌లో బీభత్సం సృష్టించిన భల్లూకాన్ని మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు అధికారులు
నిన్న రాత్రి నుంచి కరీంనగర్‌లో ఎలుగుబంటి అధికారులను పరుగులు పెట్టించింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఊరిలోకి వచ్చిన ఎలుగుబంటి ఇళ్లల్లో దూరిపోతూ టెన్షన్ పెట్టింది. ఈ క్రూరమృగానికి భయపడిపోయిన జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. తలుపు వేసుకొని ఇళ్లల్లోనే ఉండిపోయారు.
కరీంనగర్‌లోకి ఎలుగుబంటి ప్రవేశించి భయపెడుతున్న విషయాన్ని తెలుసుకున్న అధికారుల అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రి కరీంనగర్ చేరుకున్న అటవీ అధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు.
ఎలుగుబంటి తిరిగేప్రాంతాల్లో నెట్‌లు వేశారు. అయినా ప్లాన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. సుమారు 12 గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. చివరి ఆఫ్షన్‌గా మత్తు మందును వినియోగించాల్సి వచ్చింది.
మత్తు మందు లోడ్ చేసిన సిరింజ్‌ను గన్ సాయంతో ఎలుగుబంటివైపు షూట్ చేశారు. అప్పటికే జనాలను చూసి పరుగెడుతున్న ఎలుగుబంటి కాలికి ఆ మత్తుమందుతో ఉన్న సిరంజ్ గుచ్చుకుంది. మత్తుమందు స్ప్రెడ్ అవ్వడంతో కాసేపటికే ఎలుగుబంటి స్పృహతప్పి పడిపోయింది.
వెంటనే అధికారులుదాన్ని బంధించారు. ఆసుపత్రికి తరలించారు. అది పూర్తిగాా కోలుకున్న తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టేస్తామంటున్నారు. జనాల హడావుడికి ఎక్కడిపడితే అక్కడ దూడం వల్ల ఎలుగుబంటికి చిన్న చిన్న గాయాలు అయినట్టు గుర్తించిన వైద్యులు దానికి చికిత్స చేస్తున్నారు.