Sircilla: వాగులో బాలురు గల్లంతు.. ఐదుగురి మృతదేహాల వెలికితీత, మంత్రి కేటీఆర్ ఆవేదన
నవంబరు 14న ఉదయం బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలకు హాజరై తర్వాత సమీపంలోని చెక్ డ్యామ్ వద్దకు ఆరుగురు బాలురు ఈత కొట్టేందుకు వెళ్లారు.
సిరిసిల్లలో బాలల దినోత్సవం రోజునే ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక రాజీవ్ నగర్‌కు చెందిన ముగ్గురు బాలురు వాగులో పడి గల్లంతయ్యారు. అనేక గంటల వెతుకులాట తర్వాత వారి మృతదేహాలను అధికార యంత్రాంగం బయటకు తీయించింది. ఈ బాలురు నేత కార్మికుల కుమారులు. నవంబరు 14న ఉదయం బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలకు హాజరై తర్వాత సమీపంలోని చెక్ డ్యామ్ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఎవరికి కూడా ఈత రాకపోయినప్పటికీ అందులో దిగి స్నానం చేసే ప్రయత్నం చేశారు.
దీంతో వీరిలో గణేష్, క్రాంతి కిరణ్, రాకేష్, వెంకట సాయి, అజయ్‌తో బాటు మరో బాలుడు నీటిలో మునిగిపోయారు. ఈత రాకపోవడం లోతు ఎక్కువ ఉండడంతో అంచనా వేయలేక అందులో మునిగి చనిపోయారు. అయితే ఒడ్డున మిగిలినవారు కేకలు వేయడంతో సమీపంలోని జాలర్లు, రైతులు పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే నీటమునిగిన ఆ బాలురు వలలకు సైతం చిక్కలేదు. దీంతో ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు చివరికి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను బయటకు తీయగలిగారు.
అంతా 15 ఏళ్లలోపు వారే..
మొత్తంగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లారు. ఈ ఘటనలో రాజీవ్‌నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్(15), జడల వెంకటసాయి(14), తీగల అజయ్(14), కొంగ రాకేశ్ (15) శ్రీరామ్ క్రాంతి (14) వాగులోకి దూకారు. నీరు లోతుగా ఉండటంతో వారంతా గల్లంతయ్యారు. దీంతో భయపడిన సింగం మనోజ్(14), దిడ్డి అఖిల్(15)తోపాటు మరో బాలుడు అక్కడి నుంచి భయంతో వెళ్లిపోయిన స్థానికులకు విషయం తెలిపారు.
Also Read : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
పుట్టినరోజునే మృత్యువాత
ఇందులో క్రాంతి కిరణ్ అనే అబ్బాయి జన్మదినం ఆ రోజే కావడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. వారి కుటుంబాల వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read : ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్
మంత్రి కేటీఆర్ ఆవేదన
బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నియోజకవర్గంలోని జలవనరులు సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వహించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.