Telangana Gurukul Schools: జిల్లాకు మరో గురుకుల పాఠశాల, కాలేజీ మంజూరు - ఉత్తర్వులు జారీ
కరీంనగర్ జిల్లాలో కొత్తగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల... మరియు మరో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
![Telangana Gurukul Schools: జిల్లాకు మరో గురుకుల పాఠశాల, కాలేజీ మంజూరు - ఉత్తర్వులు జారీ Karimnagar Gurukul School and College sanctioned by Telangana Govt DNN Telangana Gurukul Schools: జిల్లాకు మరో గురుకుల పాఠశాల, కాలేజీ మంజూరు - ఉత్తర్వులు జారీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/86dcabc855353191b41f34b0624c5b0b1663925576702233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బీసీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు కరీంనగర్ జిల్లాలో కొత్తగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల... మరియు మరో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. కొత్తగా ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ తో పాటు రాజన్న సిరిసిల్ల, పెద్దపెల్లి, జగిత్యాల జిల్లాలో కూడా బీసీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పది గురుకుల పాఠశాలలను ఏర్పాటు కాగా ప్రతి సంవత్సరం వాటిలో ప్రవేశాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ పోటీ ఎదురవుతోంది. వాటిలో సీట్లు సాధించాలని వారు ఎలాగైనా ప్రవేశాలు పొందాలని ఆసక్తితో అధికారులు, నేతలను ఆశ్రయిస్తున్నారు.
ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో మరిన్ని గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాకు ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు కొత్తగా మంజూరైన బీసీ గురుకుల బాలికల పాఠశాలలో భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అనువైన అద్దె భవనాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. శివారుతో పాటు నగరంలోని కొన్ని భవనాలు ఇప్పటికే గుర్తించినా బాలికల పాఠశాల కావడంతో నగరంలోని భవనంలోనే దీనిని ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం కల్పిస్తూ కోసం ప్రయత్నం కొనసాగుతోంది. ప్రస్తుతం విద్యాలయాలకు దసరా సెలవులు ప్రారంభమవుతున్న సమయంలో సెలవుల అనంతరం ఈ గ్రూపులో పాఠశాలను వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్తగా ఏర్పాటయ్యే ఈ స్కూల్ లో 5, 6, 7 తరగతుల్లో బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక్కో తరగతికి రెండు సెషన్లలో 80 మంది బాలికలకు అవకాశం దక్కనుంది. ఈ లెక్కన మొత్తం 270 మంది బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నారు. కొత్తగా ఇతరులకు ప్రవేశాలు కల్పించే విషయాన్ని సైతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పది గురుకుల పాఠశాలలు ఉండగా, వాటిలో 4969 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్తగా ఇతరులకు ప్రవేశాలు కల్పించే విషయాన్ని సైతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా గల 26 గురుకుల పాఠశాలలో 12,000 మంది విద్యార్థులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న బీసీ గురుకుల, డిగ్రీ కళాశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మూడు మంజూరయ్యాయి. కరీంనగర్ లో బాలికలు రాజన్న సిరిసిల్ల, పెద్దపెల్లి జిల్లా లో బాలుర విభాగంలో డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. వాటిలో ఎనిమిది రకాల డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఒక్కో కళాశాలలో 320 మందికి ప్రవేశాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనట్లు తెలుస్తోంది. వాటిని సైతం అద్దె భవనాల్లోనే వచ్చే నెలలో ప్రారంభించేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్రీ కళాశాలల్లో కొత్తగా ఏర్పాటవుతున్న వీటితో పలువురు విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
Mahatma Jyotiba Phule, Karimnagar, BC Gurukul School, Telangana
కరీంనగర్, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల, గురుకుల పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)