Karimnagar: పిచ్చి వేషాలు మానుకోండి.. అంతా గమనిస్తున్నారు, ఆ రోజు దగ్గర్లోనే..: ఈటల
తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా హుజూరాబాద్ ప్రజలు తీర్పు ఇచ్చారని ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికల కోసం ప్రలోభాల పర్వం కొనసాగిందని అన్నారు.
దేశ చరిత్రలో హుజూరాబాద్ లాంటి ఎన్నికలు ఎక్కడ జరగలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇలాంటి ఎన్నికలు రాబోయే కాలంలో ఎప్పుడు జరగవద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల కోసం ప్రలోభాల పర్వం కొనసాగిందని అన్నారు. ఆఖరికి హుజూరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించారించారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా హుజురాబాద్ ప్రజలు తీర్పు ఇచ్చారని ఈటల రాజేందర్ మాట్లాడారు.
‘‘హుజూరాబాద్ ఎన్నికల్లో రూ.వందల కోట్లను పోలీసులు స్వయంగా తీసుకువచ్చి ప్రజలకు పంచారు. కమలపూర్‌లో ఎల్లమ్మ దేవతపై ప్రమాణం చేయించి మరీ డబ్బులు ఇచ్చారు. ఆశా వర్కర్, వీఆర్వో, వంటి గ్రామ స్థాయి అధికారులను బెదిరించి ఓట్లు వేయించాలని ఆదేశించారు. ఇలాంటి రాజకీయాలు రాబోయే కాలంలో అరిష్టంగా మారే అవకాశం ఉంది. రూ.వందల కోట్లు ఉన్నవారే అధికారంలోకి రావాలనేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారు. నేను ఔట్ సోర్సింగ్ ద్వారా 22 మంది ఉద్యోగాలు పెట్టిస్తే వారందరినీ తీసేశారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నోళ్ల ఉద్యోగాలు మాత్రం ఉంచారు.
‘‘కమలపూర్ మండలం ఇప్పుడు హనుమకొండ జిల్లాలోకి వచ్చింది. కోచ్ ఫ్యాక్టరీపై టీఆర్ఎస్ నాయకులవి అన్ని అబద్దాలు. పిచ్చి వేషాలను టీఆర్ఎస్ నాయకులు మానుకోవాలి. నాయవంచనకు పాల్పడిన మూర్ఖులు టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ ప్రజలంతా అన్ని గమనిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది. వరి విషయంలో కేంద్రం స్పష్టంగా లేఖ రాసింది. రా రైస్ ఇవ్వాలని స్పష్టంగా సూచించారు.
బాయిల్డ్ రైస్‌ను తీసుకోమని చెప్పారు. అధికారం మీద ఉన్న యావ అభివృద్ధిపై, రైతులపై లేదు. ఒక్క రైస్ క్లస్టర్ కూడా తెలంగాణలో రాలేదు. దీని వలన రైతు క్వింటాల్‌కు రూ.140 వరకూ నష్టపోతున్నారు. సజ్జలు, రాగులు వంటి పంటలు పండించేలా ఏ జిల్లాలో ఏ పంటలు పండుతాయో సర్వే చేయించేలా దృష్టి పెట్టాలి. జరుగుతున్న పరిణామాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగం ఉసురు పోసుకోకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి.’’ అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
Also Read: Nalgonda: బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తత.. చెప్పులు, గుడ్లు విసురుకున్న నేతలు
Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇలా..
Also Read: నా భార్య బజారుకీడుస్తోంది, చచ్చిపోతున్నా.. పురుగుల మందు తాగేసిన బ్యాంకు ఉద్యోగి.. చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి