Nalgonda: బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తత.. చెప్పులు, గుడ్లు విసురుకున్న నేతలు
సంజయ్ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అటు సంజయ్ టూర్‌కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
నల్గొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఘర్షణకు దారి తీసింది. నల్గొండ జిల్లాలోని ఆర్జాలబావి వద్ద ఓ ధాన్యం కొనుగోలు కేంద్రానికి సోమవారం మధ్యాహ్నం బండి సంజయ్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని నల్ల జెండాలను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ ఉండడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని గొడవను ఆపేందుకు యత్నిస్తున్నారు.
సంజయ్ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అటు సంజయ్ టూర్‌కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై మరొకరు కోడిగుడ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు కలగజేసుకొని రెండు వర్గాలను చెదరగొట్టారు. ఆ ఉద్రిక్తతల మధ్యే ఆర్జాలబావి ఐకేపీ సెంటర్‌ను బండి సంజయ్ పరిశీలించారు. అక్కడి నుంచి బండి సంజయ్ కాసేపట్లో మిర్యాలగూడ వెళ్లారు.
Also Read: కేసీఆర్‌కి తెలంగాణ గురించి ఏం తెలుసు? అన్నీ డ్రామాలే.. ఆ విషయం ఒప్పుకున్నట్లేగా..: మధుయాస్కీ
మీడియాతో మాట్లాడిన బండి సంజయ్
ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని అన్నారు. రోడ్లు, పొలాల్లో ఎక్కడ చూసినా ధాన్యమే ఉంటోందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉంటే రైతుల సమస్యలు తెలుస్తాయా? అని ప్రశ్నించారు. రైతుల మీద దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు, రాళ్లు వేస్తే రైతులకు తగిలాయని పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపైసా కేంద్రం ఇస్తుందని, కోటి లక్షల టన్నుల ధాన్యం కేంద్రం కొన్నదని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
మరోవైపు, యాసంగి పంట కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే బండి సంజయ్ పర్యటనకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సవాల్ చేశారు. కేంద్ర సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చి అన్నదాతలను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. బండి సంజయ్ జనాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. యాసంగి పంటను కొనేలా బండి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
Also Read: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా
Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇలా..
Also Read: నా భార్య బజారుకీడుస్తోంది, చచ్చిపోతున్నా.. పురుగుల మందు తాగేసిన బ్యాంకు ఉద్యోగి.. చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి