By: ABP Desam | Updated at : 15 Nov 2021 12:22 PM (IST)
Edited By: Venkateshk
మధుయాస్కీ (ఫైల్ ఫోటో)
కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ మధుయాస్కీ గౌడ్ విమర్శించారు. తెలంగాణ గురించి కేసీఆర్‌కే చెబుతారా? అంటే.. ప్రెస్ మీట్లలలో ఫైర్ అయ్యే కేసీఆర్‌కు అసలు తెలంగాణ గురించి ఏమీ తెలియదని, రాష్ట్రానికి ఏమి కావాలో అసలు అవగాహన లేదని కొట్టిపారేశారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో తెలంగాణ విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన వాటి గురించి ప్రస్తావన అయినా కేసీఆర్ ప్రభుత్వం చేసిందా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌కు రావాల్సిన ఐటీఐఆర్ భారీ ప్రాజెక్టు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలేనని గుర్తు చేశారు. వీటిపైన ఈ ఏడేళ్లలో ఏనాడైనా బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిలదీసిందా? కనీసం అడిగిందా? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లుగా పార్లమెంట్‌లో అండగా నిలిచిన కేసీఆర్.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా.. ఇప్పుడు కేటీఆర్.. కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు పెద్ద పెద్ద డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని కేసీఆర్ అంటున్నారని.. అంటే ఇన్నేళ్లనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తీసుకురాలేకపోయాని నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించినట్లే కదా అని ఆక్షేపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీతో కుస్తీ డ్రామాలు ఆడేందుకు సమయం ఉంటుంది కానీ.. ధరలు తగ్గి అయోమయంలో ఉన్న పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సమయం ఉండదని నిలదీశారు. కేవలం వారం రోజుల్లోనే క్వింటాలు పత్తికి రూ.వెయ్యి తగ్గిందని.. వరంగల్ జిల్లా సహా ఎనుమాముల మార్కెట్ సహా ఇదే పరిస్థితి ఉందని పత్రికల్లో వస్తోందని గుర్తు చేశారు.
దీనిపై సంబంధిత మంత్రిగానీ.. ముఖ్యమంత్రిగానీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికైనా పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు ఆపి ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Also Read: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇలా!
Also Read: నా భార్య బజారుకీడుస్తోంది, చచ్చిపోతున్నా.. పురుగుల మందు తాగేసిన బ్యాంకు ఉద్యోగి.. చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్
Amit Shah: కేసీఆర్‌కి ఉన్న బాధల్లా ఒక్కటే, తన కొడుకుని సీఎం చేయాలని-అమిత్‌షా సెటైర్లు
Secunderabad Bjp Meeting : బీజేపీ విజయసంకల్ప సభ, భారీగా తరలివచ్చిన శ్రేణులు, హాజరైన ప్రజాగాయకుడు గద్దర్
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు