Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన
హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ధూంధాం కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు.
హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచార వేడి రాన్రానూ మరింత వేడిగా తయారవుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ధూంధాం కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. నిత్యావసర సరకుల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని హరీశ్ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో జనం బాధలు పడ్డా ఫరవాలేదని.. మీరు మాత్రం నాకే ఓటేయాలని ఈటల రాజేందర్ కోరుతున్నాడని విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై ఉత్తర్ ప్రదేశ్‌లో కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీదని విమర్శించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోగానే కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను మరో రూ.200 పెంచుతుందని ఆరోపించారు. బీజేపీకి ఓటేస్తే సిలిండర్ ధర రూ.1500 అవుతుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం రైతులు, సామాన్యులను పీడిస్తుందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని బొంద పెడితేనే సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులను ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఆపొద్దని సీఎం కేసీఆర్ తమ జీతాలకు కోత పెట్టారని చెప్పారు. ఈటల రాజేందర్ ఏడేళ్లుగా మంత్రిగా ఉన్నా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు.
వ్యవసాయ మోటార్లకు బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెడతామంటే వద్దని చెప్పి.. మా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని మంత్రి అన్నారు. రైతు చట్టాలను వ్యతిరేకించిన ఈటల రాజేందర్ ఇప్పుడు మాట మార్చాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ లేకపోతే అసలు ఈటల రాజేందర్ అనే వాడు ఉన్నడా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఓట్ల కోసం ఈటల పచ్చి మోసపు మాటలు, అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌లో ఒక్క రూపాయి పని చేయని ఎంపీ అరవింద్.. హుజూరాబాద్‌లో పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.
హరీశ్ రావు కీలక ప్రకటన
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే రైతుల రుణం వడ్డీతో సహా మాఫీ చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. అనంతరం జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ 57 ఏళ్లకు పెన్షన్, 5 వేల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాలని హరీశ్ రావు సవాలు విసిరారు.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
మంత్రి హారీష్ రావు గారి ఛాలెంజ్ తో తోక ముడిచిన బీజేపీ ఈటల రాజేందర్@GelluSrinuTRS @trsharish @trspartyonline #HuzurabadWithTRS #VoteForCar pic.twitter.com/Dpjp3KND4R
— KCR Unofficial (@kcrunofficial) October 23, 2021
Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి