By: ABP Desam | Updated at : 10 Apr 2023 07:06 PM (IST)
వరంగల్ సీపీ రంగనాథ్ పై బండి సంజయ్ లీగల్ ఫైట్ కు రెడీ!
పేపర్ లీకేజీ కేసులో వరంగల్ సీపీ రంగనాథ్‌పై పరువునష్టం దావా వేసేందుకు బండి సంజయ్ రెడీ అవుతున్నారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజీ విషయంలో ఎంపీ అయిన తనపై సీపీ రంగనాథ్ నిరాధార ఆరోపణలు చేశారని బండి సంజయ్ కోర్టుకు వెళ్లనున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో విచారణకు రావాలన్న కమలాపురం పోలీసుల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. ఈ కేసులో విచారణ మరిన్ని వివరాలు ఇచ్చేందుకు ఇవాళ విచారణకు రావాలని కమలాపురం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోన్‌తో విచారణకు రావాలని పిలుపునిచ్చారు. అయితే తన ఫోన్ పోయిందని అందుకే విచారణకు రాలేనని చెప్పారు బండి సంజయ్. తన ఫోన్ దొరికే వరకు విచారణకు పిలవద్దని చెప్పారు. ఎంపిగా ఉన్న తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని పోలీసులకు చెప్పారు.
మరోవైపు ఈ కేసులో తనపై లేనిపోని ఆరోపణలు చేశారని వరంగల్ సీపీ రంగనాథ్‌పై బండి సంజయ్ ఫైట్‌కు సిద్ధమయ్యారు. ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేశారు. రంగనాథ్ ఇష్యూను అంత తేలిగ్గా విడిచిపెట్టబోమన్న బండి... ఆయనపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయనపై ఓ పెద్ద రిపోర్టు రెడీ చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి కూడా రిపోర్ట్ చేయనున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.
వరంగల్ సీపీ రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్. తనపై నిరాధార ఆరోపణలు చేయడంతో పాటు విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలని చూశారని తనపై లేనిపోని ఆరోపణలు చేశారు కనుక వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తామన్నారు. తన ఫోన్ సిద్దిపేటలోనే పోయిందని, ప్రస్తుతం తన ఫోన్ సీఎం కేసీఆర్ వద్ద ఉందని ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తన ఫోన్ తిరిగి ఇవ్వడం లేదన్నారు. తన ఫోన్ కాల్స్ కంటే ముందు సీపీ రంగనాథ్ ఫోన్ కాల్ లిస్టు బయటకు తీస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు.
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
Karimnagar: అభివృద్ధిపై బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ చర్చకు సిద్ధమా? పొన్నం ప్రభాకర్ సవాల్
RTO Vehicle Registration: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, సర్వర్ డౌనే కారణం
Venkateshwara Temple Karimnagar: టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో శ్రీవారి ఆలయం - శంకుస్థాన చేసిన మంత్రి గంగుల, వైవీ సుబ్బారెడ్డి
Eklavya Model Schools Results: ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!