IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

JC Diwakar : ప్రగతిభవన్‌ వద్ద జేసీ దివాకర్ హల్ చల్.. అపాయింట్‌మెంట్ లేకుండా లోనికి వెళ్లే ప్రయత్నం.. వెనక్కి పంపేసిన పోలీసులు !

కేటీఆర్‌ను కలవాలని ప్రగతిభవన్‌లోకి వెళ్లేందుకు ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించారు. అపాయింట్‌మెంట్ లేకపోవడంతో సెక్యూరిటీ వెనక్కి పంపేశారు.

FOLLOW US: 

హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కాసేపు హల్ చల్ చేశారు. ఉదయం ఆయన నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లిపోయారు. అయితే గేటు వద్దే పోలీసులు నిలిపివేశారు. ప్రగతి భవన్‌లోకి వెళ్లేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్న వారి జాబితాలో జేసి దివాకర్ రెడ్డి పేరు లేదు. తాను కేసీఆర్‌ను కాదని కేటీఆర్‌ను కలవాలని పోలీసులతో జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కారు దిగి కాసేపు హల్ చల్ చేశారు. అయితే పోలీసులు మాత్రం కేటీఆర్‌ అపాయింట్‌మెంట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. 

Also Read: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వరా ? ఏపీ , బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం !

జేసీ దివాకర్ రెడ్డి వచ్చినట్లుగా ప్రగతి భవన్ అధికారులుక పోలీసులు సమాచారం ఇచ్చినా .. సరైన స్పందన లేకపోవడంతో లోపలికి పంపలేదు. చివరికి జేసీ దివాకర్ రెడ్డి అక్కడ్నుంచి వెనక్కి వెళ్లిపోయారు. అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లాలని ప్రయత్నించడంతోనే సమస్య ఎదురయిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు తరచూ అసెంబ్లీకి వస్తారు. అక్కడ అన్ని పార్టీల నేతలతోనూ సమావేశం అవుతారు. మీడియాలో హైలెట్ అయ్యేలా వ్యాఖ్యలు చేస్తారు.

Also Read:  గూగుల్‌మీట్‌లో పెళ్లి వేడుక.. జోమాటో విందు డోర్ డెలివరీ ! మరి కానుకలు ఎలా తీసుకున్నారో తెలుసా ?

 గత సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చి కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌తోనూ సమావేశమయ్యారు. ఆ తరవాత మీడియాతో మాట్లాడుతూ..  ఇప్పుడు ఏపీలో రాజకీయాలు ఏమీ బాగోలేవని తెలంగాణలో మాత్రం బాగున్నాయని తాము తెలంగాణకు వస్తామని వ్యాఖ్యానించారు. సరదాగా అన్నారో ..సీరియస్‌గా అన్నారో స్పష్టత లేదు కానీ.. ఇప్పుడు కేటీఆర్‌తో భేటీ కోసం ప్రయత్నించడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. 

Also Read: PM Security : ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?

అయితే జేసీ వ్యాపార వ్యవహారాలపై చర్చించేందుకు వచ్చి ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి అపాయింట్‌మెంట్ లేకుండా ఎవర్నీ ప్రగతి భవన్‌లోకి పంపే అవకాశం ఉండదు. ఆ విషయం జేసీకి తెలుసు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో నేరుగా వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయినా ఆయనకు లోపలకు వెళ్లే అవకాశం చిక్కలేదు. 
Published at : 19 Jan 2022 02:02 PM (IST) Tags: Hyderabad pragati bhavan JC Divakar Reddy JC Hull Chal at Pragati Bhavan Police sending JC back TDP leader JC Divakar Reddy

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం, చార్మినార్ వద్ద కాలిపోయిన దుకాణం

Breaking News Live Updates: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం, చార్మినార్ వద్ద కాలిపోయిన దుకాణం

Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్‌, ముచ్చటగా మూడోసారి

Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్‌, ముచ్చటగా మూడోసారి

Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్‌కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి

Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్‌కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి

Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ

Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు, అసలు ఎవరీ అన్యం సాయి?

Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు, అసలు ఎవరీ అన్యం సాయి?

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర

Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురి దుర్మరణం

Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురి దుర్మరణం

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది