News
News
వీడియోలు ఆటలు
X

Telangana Congress News : కాంగ్రెస్‌లో జానారెడ్డి ఆపరేషన్ - రేవంత్‌తో చేతులు కలిపిన సీనియర్లు ! జగ్గారెడ్డి ఒంటరేనా ?

రేవంత్ ను వ్యతిరేకిస్తున్న సీనియర్ల మధ్య జానారెడ్డి సఖ్యత కుదిర్చారు. నల్లగొండ నిరుద్యోగ ర్యాలీతో కాంగ్రెస్‌లో ఐక్యత కనిపిస్తోంది.

FOLLOW US: 
Share:

Telangana Congress News :  కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి రాక సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో తమకు సమాచారం లేదని కీలక నేతలు వాయిదా వేయించిన  నిరుద్యోగ నిరసన ర్యాలీ సభను శుక్రవారం నిర్వహించారు.  ఎంపీలు ఉత్తమ్​ కుమా ర్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హాజరయ్యారు. జిల్లా అగ్రనేతలు అందరూ రేవంత్​ సభలో పాల్గొనడం, ఆయనకు అండగా ఉంటామని స్పష్టం చేయడం పార్టీ కేడర్​లో జోష్​ నింపింది.                              

ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, వెంకట్​రెడ్డి సొంత నియోజకవర్గాల ఎమ్మెల్యేలను టార్గెట్​ చేసి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జానారెడ్డి చేసిన కృషిని వివరించడమేగాక, మంత్రి పదవి త్యాగం చేసిన వెంకట్​ రెడ్డిని కొండా లక్ష్మణ్​ బాపూజీతో పోల్చారు. పౌరషం కలిగిన వ్యక్తి దామోదర్​ రెడ్డి అని కీర్తించడ మేగాక, సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి జగదీశ్​రెడ్డిని టార్గెట్​ చేసి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్​టాపిక్​గా మారాయి.                           

నల్గొండలో రేవంత్​ సభను సక్సెస్​ చేయడంలో  జానారెడ్డి కీలక పాత్ర పోషించారు.  ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​ నేతలందరని ఏకతాటికి పైకి తీసుకొచ్చే బాధ్యతను   జానారెడ్డి భుజానెత్తుకున్నారు. ఇదే రకమైన పంథాను ఎన్నికల్లోనూ కొనసాగుతుందని జానారెడ్డి అన్నారు. పార్టీ గెలుపు కోసం, తాను సమైఖ్య యోధుడిగా పాటుపడతానని చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా తామంతా కలిసికట్టుగానే ఉన్నామని, చిన్న మనస్పర్ధలు ఉన్నా వాటిన్నింటిని పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేస్తామని ఎంపీ వెంకట్ రెడ్డి సైతం రేవంత్‌కు ​మద్దతు తెలిపారు. ప్రధాని మోడీని కలినంత మాత్రాన బీజేపీలో చేరినట్టుకాదని, అట్లాగే రేవంత్​ నల్గొండకు రానంత మాత్రాన తాను అడ్డు చెప్పినట్టు కాదని, పరి స్థితులను బట్టి తామే రేవంత్‌​ను నల్గొండకు ఆహ్వానిద్దామని అనుకున్నా మని వెంకట్​రెడ్డి వివరణ ఇచ్చారు.                      

ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు గెలిచి సాధిస్తామన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు సైతం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలిసికట్టుగానే ఉన్నామని చెప్పారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సభకు రావడం, అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయడం పార్టీలో కొత్త ఊపు తీసుకొచ్చింది. దీంతో సీనియర్లు అంతా మరోసారి ఏకమయినట్లు అంది. అయితే జగ్గారెడ్డి మాత్రం వరుసగా లేఖలు విడుదల చేస్తూ.. తాను అసంతృప్తిగానే ఉన్నానని సంకేతాలు పంపుతున్నారు. తాజాగా పాదయాత్రకు అనుమతి కోరుతూ లేఖ కూడా రాశారు. 

Published at : 29 Apr 2023 04:44 PM (IST) Tags: Revanth Reddy Komati Reddy Venkata Reddy Telangana Congress Politics

సంబంధిత కథనాలు

Sharmila Meet Sivakumar  : మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ -  కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Sharmila Meet Sivakumar : మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day:  ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?