![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hyderabad BJP Office : బీజేపీ ఆఫీసుపై ఇంక్ దాడి - పోలీసు కేసు నమోదు !
హైదరాబాద్ బీజేపీ కార్యాలయంపై ఇంక్ దాడి జరిగింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు.
![Hyderabad BJP Office : బీజేపీ ఆఫీసుపై ఇంక్ దాడి - పోలీసు కేసు నమోదు ! Ink attack on Hyderabad BJP office. Hyderabad BJP Office : బీజేపీ ఆఫీసుపై ఇంక్ దాడి - పోలీసు కేసు నమోదు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/04300eec06221a7b07dc3c88562c0b151680087663245228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad BJP Office : హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ ఆఫీసు గేటుపై గుర్తు తెలియని వ్యక్తులు ఇంక్ చల్లి పరారయ్యారు. అర్థరాత్రి పూట ప్రత్యేకంగా బైక్‌పై వచ్చిన యువకులు ఉద్దేశపూర్వకంగానే తమతో ఇంక్ తెచ్చుకుని గేటుపై చల్లి పరారయినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు. ఉదయమే పార్టీ కార్యాలయం గేటుపై ఇంకు చల్లినట్లుగా ఉండటంతో వెంటనే గుర్తించిన బీజేపీ నాయకులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఎవరో ఆకతాయిలు చేసిన పని కాదని ఉద్దేశపూర్వకంగానే ఇంక్ చల్లినట్లుగా గుర్తించారు. వెంటనే అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్యాలయ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అర్ధరాత్రి 1.45 గంటలకు ఘటన జరిగినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.
సాధారణంగా రాజకీయ పార్టీల నేతలపై ఇంక్ దాడులు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఇష్టం లేని నేతలు ప్రసంగాలు చేస్తూంటే వారిపై హఠాత్తుగా ఇంక్ పోస్తూ ఉంటారు దుండగులు. ఇదో రకమైన నిరసనగా పేర్కొంటూ ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ లాంటి వారిపై ఇలాంటి ఇంక్ దాడులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా మనుషులపై కాకుండా పార్టీ ఆఫీసులపై ఇంక్ దాడులు చేయడం ఇటీవలి కాలంలో లేదు. సాధారణంగా ఇలాంటి విషయాలు పెద్దగా హైలెట్ కావు. కానీ ఇక్కడ బీజేపీ కార్యాలయంపై ఉద్దేశపూర్వకంగా ఇంక్ దాడి జరిగింది. పని గట్టుకుని వచ్చి ఇంక్ పోశారు. సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసి కూడా .. తమ ఐడెంటిటీ తెలియకుండా ఈ ఇంకా దాడి చేసినట్లుగా తెలుస్తోంది.
ఏదో విషయంలో తమ నిరసన వ్యక్తం చేయడానికి ఇలా చేశారా లేక తమ రాజకీయ పార్టీకి మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా తుంటరిగా ఈ పని చేశారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఇది పెద్ద కేసు కాదు కాబట్టి పోలీసులు సీరియస్‌గా తీసుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలని అంటున్నారు. దీన్ని సెక్యూరిటీ బ్రీచ్‌గా చూడాలంటున్నారు. అర్థరాత్రి పూట ఇలా దాడి చేయడం చిన్న విషయం కాదంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి మామూలుగానే పటిష్ట భద్రత కల్పిస్తారు. ఇరవై నాలుగు గంటలూ పహారా కాసే భద్రతా సిబ్బంది ఉంటారు. అయితే ఇంక్ దాడి జరుగుతున్న సమయంలో ఎవరూ లేరు.
బీజేపీ నేతలు తమకు ఫలానా వారిపై అనుమానం ఉందని వ్యక్తం చేయలేదు. ఇది చిన్న ఇష్యూనే కదా అని వదిలేస్తే రేపు అర్థరాత్రి పూట ఆఫీసుపైనే దాడి చేయవచ్చునని.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. బీజేపీ నేతలు కూడా అసలు ఈ ఇంక్ దాడి ఎవరు చేశారన్న దానిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. సున్నితమైన ప్రాంతంలోనే బీజేపీ ఆఫీసు ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)