Dalitha Bandhu: దళిత బంధు విషయంలో అదే జరిగితే యాదాద్రిలో ఆత్మహత్య చేసుకుంటా: మోత్కుపల్లి

దళిత బంధు పథకానికి మద్దతుగా ఆదివారం మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేపట్టారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆయన.. ఉదయం 10 గంటల సమయంలో నివాసంలోనే దీక్ష మొదలుపెట్టారు.

FOLLOW US: 

దళిత బంధు పథకాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, దీన్ని విజయవంతం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కేసీఆర్ కచ్చితంగా అమలు చేస్తారని రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. ఒకవేళ దళిత బంధు అమలు కాకుంటే తాను యాదగిరి గుట్ట దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని సవాలు విసిరారు. దళిత బంధు పథకానికి మద్దతుగా ఆదివారం మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేపట్టారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆయన.. ఉదయం 10 గంటల సమయంలో నివాసంలోనే దీక్ష మొదలుపెట్టారు. సాయంత్రం 5 గంటలకు వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

Also Read: YSR Death Anniversary: వైఎస్ కేబినేట్ మంత్రులకు విజయమ్మ ఆహ్వానం!... పిలుపుపై రాజకీయవర్గాల్లో చర్చ

దళిత బంధు విషయంలో సీఎం కేసీఆర్‌‌ను మోత్కుపల్లి ప్రశంసలతో ముంచెత్తారు. కేసీఆర్ దళితుల ఆత్మబంధువని కొనియాడారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తాను 30 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఏ సీఎం కూడా కేసీఆర్‌లా దళితుల అభివృద్ధి కోసం పని చేయలేదని విమర్శించారు. దళితుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు. ఎవరు మంచిపని చేసినా ఆహ్వానించాల్సిందేనని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు

రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. ఆయన శనిపాదం అని మోత్కుపల్లి విమర్శించారు. తెలంగాణలో టీడీపీని సర్వనాశనం చేసిందే రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. ఆయన జీవితం మొత్తం మోసమేనని దుయ్యబట్టారు. రూ.వందల కోట్లు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. సొంతూరిలో దళితులను రేవంత్ ఏనాడైనా గౌరవించాడా అని ప్రశ్నించారు. బండి సంజయ్‌ పాదయాత్ర ఎవరికోసం చేస్తున్నాడని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఆయన పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని కొట్టిపారేశారు.

Also Read: In Pics: రాష్ట్రంలో టీఆర్ఎస్.. కేంద్రంలో బీజేపీ.. ఇంకో 20 ఏళ్లు ఇంతే.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Published at : 29 Aug 2021 01:34 PM (IST) Tags: revanth reddy huzurabad news Dalitha bandhu news Mothkupally Narsimhulu Mothkupally comments

సంబంధిత కథనాలు

Hyderabad: హైదరాబాద్‌లో చైల్డ్ పోర్న్ ముఠాలు, ఈ 3 ప్రాంతాల నుంచి వీడియోలు అప్‌లోడ్! అదుపులోకి ముగ్గురు?

Hyderabad: హైదరాబాద్‌లో చైల్డ్ పోర్న్ ముఠాలు, ఈ 3 ప్రాంతాల నుంచి వీడియోలు అప్‌లోడ్! అదుపులోకి ముగ్గురు?

Karimnagar News : కరీంనగర్ లో కొత్త మండలాలు, కసరత్తు చేస్తున్న అధికారులు!

Karimnagar News : కరీంనగర్ లో కొత్త మండలాలు, కసరత్తు చేస్తున్న అధికారులు!

Breaking News Live Telugu Updates: రాజేంద్రనగర్‌లో ఘోరం, మహిళను ఢీకొట్టిన కారు - రివర్స్ తీసుకొని మరీ

Breaking News Live Telugu Updates: రాజేంద్రనగర్‌లో ఘోరం, మహిళను ఢీకొట్టిన కారు - రివర్స్ తీసుకొని మరీ

Naga Babu Satires: నాగబాబు అంతమాట అనేశారేంటీ? ప్రధాని, సీఎం అందర్నీ వాయించేశారు!

Naga Babu Satires: నాగబాబు అంతమాట అనేశారేంటీ? ప్రధాని, సీఎం అందర్నీ వాయించేశారు!

Chintamaneni Reaction: కోడిపందేల ఘటనలో ఎస్కేప్ ఆరోపణలపై చింతమనేని రియాక్షన్, ఏమన్నారంటే

Chintamaneni Reaction: కోడిపందేల ఘటనలో ఎస్కేప్ ఆరోపణలపై చింతమనేని రియాక్షన్, ఏమన్నారంటే

టాప్ స్టోరీస్

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?

Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!

Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!