Plane Crash : విమానం క్రాష్ అయ్యే చివరి క్షణాల్లో ఫైలట్ ఏం చేశాడు!: ABP దేశంతో కీలక విషయాలు పంచుకున్న మాజీ ఫైలట్ అజ్మీర్ బాబీ
Plane Crash : అహ్మదాబాద్‌లో విమానం క్రాష్ ఘటనలో ఆ చివరి 30సెకన్లు కీలకంగా మారాయి.బ్లాక్ బాక్స్ దొరికినంత మాత్రాన ప్రమాద కారణాలు అంత త్వరగా అంచనా వేయలేమంటున్నారు మాజీ ఫైలట్ బాబి

Plane Crash : అహ్మదాబాద్ ఘోర విమానప్రమాద ఘటనలో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే విమానం రన్ వే పై రోలింగ్ మొదలు టేకాఫ్ వరకూ జరిగిన పరిణామాలు మిస్టరీని మించి హీటు పుట్టిస్తున్నాయి. తాజాగా ఘటనా స్దలంలో బ్లాక్ బాక్స్ దొరకడంతో ప్రమాద సమయంలో విమానం లోపల ఏం జరిగిందనేది తేలిపోతుందని అంతా అనుకుంటారు. కానీ అలా బ్లాక్ బాక్స్ ఆధారంగా ఫైలట్ ప్రమాద చివరి క్షణాల్లో ఏం చేశాడని కచ్చితంగా చెప్పలేమంటున్నారు మాజీ ఫైలట్ అజ్మీర్ బాబీ. ABP దేశంతో మాట్లడుతూ ఆమె ఏమన్నారంటే..
ఏబిపి దేశం: అహ్మదాబాద్‌లో బోయింగ్ 787 విమానం క్రాష్ వెనుక కుట్ర జరిగిందా..? కాక్ పిట్ ఎందుకు ఎమర్జెన్సీ సంకేతాలివ్వలేదు..?
అజ్మీర్ బాబీ, మాజీ ఫైలట్ : ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం అత్యంత సురక్షితమైనది. గత పద్నాలుగేళ్లుగా ఈ విమానంలో ఈ స్దాయిలో ఎటువంటి ప్రమాదాల జరగలేదు. బిలియన్లలో ఒకటిగా తాజా క్రాష్ ను చెప్పవచ్చు. అంతలా సురక్షితమైన విమానం ఇంత ఘోర ప్రమాదానికి గురికావడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. టెక్నికల్ ఫెల్యూర్ అని అనుమానిస్తున్నప్పటికీ అలా టెక్నికల్ ఫెల్యూర్ జరిగినట్లయితే అది మూడు రకాలుగా ఉంటుంది. ఇంజన్ ఫెయిల్ అవ్వడం, లాస్ ఆఫ్ పవర్ లేదా ఇంధన సంబంధిత సమస్య తలెత్తడం జరుగుతుంది.ఈ మూడింటిలో ఏది జరిగినా, కాక్ పిట్ లో టేకాఫ్ మొదలైన వెంటనే వార్నింగ్ సంకేతాలు కనిపిస్తాయి. కానీ అలా ఏదీ జరగలేదు. ఇదిలా ఉంటే ప్రధానంగా క్రాష్ జరిగిన సమయంలో ఎంత స్పీడ్ తో విమానం ప్రయాణం చేస్తోంది. హెడింగ్ ఎంత ఉంది. ఏ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తోంది, వీటిపై ఆధారపడే క్రాష్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రమాాదానికి మరో కారణం విమానంలో రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అలా రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు బిలియన్ లలో ఒక్కటి మాత్రమే జరుగుతుంది.
ఏబిపి దేశం: ఆ చివరి క్షణాల్లో ఫైలట్ పరిస్దితి ఏలా ఉంటుంది. క్రాష్ అవ్వకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు..?
అజ్మీర్ బాబీ, మాజీ ఫైలట్ : టేకాఫ్ అయిన 30 సెకన్ల లోపే బోయింగ్ 787 విమానం క్రాష్ అయ్యింది. ఆ చివరి క్షణాల్లో ఫైలట్ సాధ్యమైనంత వరకూ విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుక చూస్తాడు. విమానం పైకి ఎగిరేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినా, ఫ్లయింగ్ కు అవకాశం లేకపోతే , ఏటీసీకి మే డే కాల్ ఇస్తారు. ఏటీసితో సంబంధాల తెగిపోతే, ఇక ఆఖరి ప్రయత్నంగా ల్యాండింగ్ పొజిషన్ కోసం చూస్తారు. ప్రమాదం సంభవించిన విమానం టేకాఫ్ అయిన వెంటనే ,ఎయిర్ పోర్టు రన్ వే దాటిన వెంటనే సమీపంలో ఉన్నవి సుమారు 600 అడుగుల ఎత్తులో ఉన్నవి నివాస భవనాలే కావడంతో అక్కడ ల్యాండింగ్ కు మరో అవకాశం లేదు. ఖాళీ ప్రాంతాలు కనిపించకపోవడంతో మెడికల్ కాలేజి క్యాంటీన్ పైన ఉన్న వాటర్ ట్యాంక్ ను ఢీ కొట్టడం, క్రాష్ అవ్వడం, భారీగా మంటలు ఎగిసిపడటం క్షణాల్లో జరిగిపోయింది.
ఏబిపి దేశం: బ్లాక్ బాక్స్ దొరికింది.. విమాన ప్రమాదంపై బ్లాక్ బాక్స్ తో క్లారిటీ వచ్చినట్లేనా..?
అజ్మీర్ బాబీ, మాజీ ఫైలట్ : బ్లాక్ బాక్స్ దొరికినంత మాత్రన క్రాష్ సమయంలో వాస్తవాలను తెలుసుకోవడం కష్టమే. ఎమెర్జెన్సీ సమయంలో ఫైలట్ లు మాట్లడుకుంటే, ఆ మాటలు మాత్రమే వినిపిస్తాయి. ఫైలట్ చివరి క్షణాల్లో ఏం చేశాడు, ప్రయాణికులన రక్షించుకోవడానికి, విమానం సేఫ్ గా ల్యాండ్ చేయడానికి ఏం చేశాడు అని చెప్పడం కేవలం బ్లాక్ బాక్స్ ద్వారా మాత్రమే సాధ్యం కాదు. ఇటువంటి అరుదైన భారీ విమాన ప్రమాదాలలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు విచారణ వివిధ రకాలుగా జరుగుతుంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి నిపుణుల బృందాలు వెళ్లడం, మృతదేహాలను, విమాన శఖలాలను పరిశీలించడం, రన్ వే టూ క్రాష్ స్పాట్ వరకూ డ్రోన్ టెక్నాలజీ కీలక ఆధారాలు సేకరించడం వీటితోపాటు గోప్యంగా ప్రమాదకారణాలపై సమాచారం సేకరించడం ఇలా వివిధ కోణాల్లో, కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణ నిర్వహించి , వాస్తవాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు.





















