అన్వేషించండి

TSPSC Group 1 Admit Cards 2024 : తెలంగాణ గ్రూప్‌ వన్‌ హాల్ టికెట్లు వచ్చేశాయ్‌- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

Telangana Goup1 Hall Tickets 2024: గ్రూప్‌ వన్‌కు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSPCS Group 1 Admit Card 2024: అక్టోబర్ 21 నుంచి జరిగే గ్రూప్ వన్ మెయిన్స్‌కు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్‌లో పెట్టింది. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన వారు ఈ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక పరీక్ష పాసైన వారంతా తమ ఐడీ, పాస్ వర్డ్ ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ https://websitenew.tspsc.gov.in/ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

గ్రూప్ వన్ హాల్ టికెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి(How To Download TSPSC Group 1 Hall Ticket )

అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష ఉంటుంది. ముందు 2.30 నుంచి 5.30 వరకు అని షెడ్యూల్‌లో చెప్పారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఓ అరగంట ముందుకు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే TSPSC Group 1 Mains admit cards అనే కాలమ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే మీ ఐడీ అండ్ పాస్ వర్డ్ అడుగుతుంది వాటిని టైప్ చేయాలి. ఎగ్జామ్ గైడ్‌లైన్స్‌కి ఓకే చెప్పిన తర్వాత admit card డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయాలి. హాల్‌టికెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రింట్ అని వస్తుంది. ఒక 

అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు 

మీరు డౌన్‌లోడ్ చేసిన కాపీని ప్రతి రోజు చూపించాల్సి ఉంటుంది. మొత్తం ఏడు రోజుల పాటు ఉపయోగించవచ్చు. మధ్యాహ్నం 12:30 గంటలకు పరీక్ష హాల్‌ను ఓపెన్ చేస్తారు. పరీక్ష హాల్ గేట్లు మధ్యాహ్నం 1:30 గంటలకు మూసివేస్తారు. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులకు ప్రవేశం ఉండదు. అడ్మిట్ కార్డ్‌లో తప్పులు ఉంటే ముందుగానే అధికారులకు తెలియజేయాలి. 
గ్రూప్‌ వన్‌కు సంబంధించిన న్యూ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 19న రిలీజ్ చేసింది. 23నుంచి అప్లికేషన్‌లు స్వీకరించింది. మార్చి 14 వరకు నుంచి అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్‌లో మార్పులు చేర్పులకు మార్చి 23 నుంచి మార్చి 27 వరకు అవకాశాన్ని కల్పించారు. 

గ్రూప్ వన్ ఉద్యోగాలు ఎన్ని? (Group 1 Jobs List TSPCS) 

563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌ను 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు రాస్తే 31,382 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరికి అక్టోబరు 21 నుంచి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. 

మెయిన్స్ పరీక్ష విధానం..
గ్రూప్-1 మెయిన్స్‌లో 6 పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్‌ 150 మార్కులు. మూడు గంటల్లో రాయాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగతా పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ 2024 పరీక్షల షెడ్యూలును ఒక్కసారి చూస్తే... అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లిష్ (ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్) అక్టోబర్ 22 పేపర్-1 (జనరల్ ఎస్సే) ఉంటుంది. అక్టోబర్ 23న పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబర్ 24న పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఉంది. అక్టోబర్ 25న పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్ష. అక్టోబర్ 26న పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఆఖరి రోజు అక్టోబర్ 27న పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ) పరీక్ష నిర్వహిస్తారు. 

మెయిన్ పరీక్ష కేంద్రాలు ఇవే: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ.

Also Read: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌లుగా కార్లు, బైకులు - జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీలోనే చేయాలి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
Telangana High Court: కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
Telangana High Court: కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
IPL 2025 GT VS RCB Result Update: బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Hyderabad Crime News:ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
Embed widget