![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gangula Father Death: మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం, పరామర్శించిన సీఎం కేసీఆర్
మంత్రి గుంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) కన్నుమూశారు. కరీంనగర్ లోని వారి నివాసంలో గంగుల మల్లయ్య బుధవారం తుదిశ్వాస విడిచారు.
![Gangula Father Death: మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం, పరామర్శించిన సీఎం కేసీఆర్ TS Minister gangula kamalakar Father mallaiah Passed Away KCR Expresses Condolence Gangula Father Death: మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం, పరామర్శించిన సీఎం కేసీఆర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/8b6ede730879598c93cc7105a59d34051672835522945233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TS Minister Gangula Kamalakar Father Passed Away: తెలంగాణ బిసి సంక్షేమం, ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో విషాదం అలుముకుంది. మంత్రి గుంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) కన్నుమూశారు. కరీంనగర్ లోని వారి నివాసంలో గంగుల మల్లయ్య బుధవారం తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే మంత్రి గంగుల కమలాకర్ నేటి తన కార్యక్రమాలను రద్దు చేసుకుని కరీంనగర్ లోని తమ ఇంటికి చేరుకున్నారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు కాగా, అందులో చిన్న కుమారుడు మంత్రి కమలాకర్.
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గంగుల మల్లయ్య మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్ మంత్రి గంగుల కు ఫోన్ చేసి పరామర్శించారు, విచారం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న గంగులను సిఎం కేసీఆర్ ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్యగారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
తండ్రిని కోల్పోయిన బాధలో వున్న గంగులను సీఎం ఓదార్చి వారికి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్య గారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం ప్రార్థించారు.
— Telangana CMO (@TelanganaCMO) January 4, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)