Telangana News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... డీఏ 10.01 శాతం పెంపు
తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఈ నెల నుంచి పెరగనున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న డీఏలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబులు అందించింది. 10.01శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. డీఏ
2021జులై1 నుంచి ఈ డీఏ వర్తింప చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ వర్తిస్తుందని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. జులై నుంచి బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నారు.
పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డీఏ చెల్లింపునకు తెలంగాణ కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. ఈ మేరకు ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల కోసం ప్రభుత్వం ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా డీఏలు పెండింగ్‌లో పడ్డాయి. పరిస్థితులు చక్కబడినందున డీఏలు పెంచుతూ జారీ చేసింది ప్రభుత్వం.
మరోవైపు ఉద్యోగుల బదిలీలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పరస్పర ఉద్యోగుల బదిలీకి అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే మాదిరిగా జీవో 317ను కూడా వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. డీఏలు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూనే ఆ వివాదాస్పద జీవోపై కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..
Also Read: Visakha Corona Cases: ఉక్కు నగరాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. విశాఖ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు
Also Read: CS Sameer Sharma: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు
Also Read: Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!