Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!
మహ్మద్ అక్బర్, హబీబా 9 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, హబీబా కంటే ముందే అక్బర్ అనీజ్ ఫాతిమా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.
విడాకులు పూర్తయి దంపతులు విడిపోయినా మాజీ భార్యపై మోజు తగ్గని ఓ వ్యక్తి ఆమెను వేధింపులకు పాల్పడుతున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. తరచూ వెంట పడుతూ వేధిస్తూ ఆమెను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా బుద్ధి మార్చుకోకుండా అవే పనులు కొనసాగించాడు. దీంతో మరోసారి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్న భార్యపై మోజు తగ్గని ఓ వ్యక్తి వెంటపడుతూ వేధిస్తున్నాడు. చందులాల్ బారాదరికి చెందిన మహ్మద్ అక్బర్ అనే వ్యక్తి.. ఓ రెస్టారెంట్‌లో అందరూ చూస్తుండగా మొదటి భార్యపై దాడికి పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.
మహ్మద్ అక్బర్, హబీబా 9 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, హబీబా కంటే ముందే అక్బర్ అనీజ్ ఫాతిమా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం అక్బర్ హబీబా కలిసి ఉన్నారు. వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయినా కూడా ఆమెపై మోజు తగ్గక ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ అక్బర్ వెంబడించేవాడు. గతంలో కూడా ఇలాగే చేసి రాంగోపాల్‌పేట పీఎస్ పరిధిలో హబీబాపై దాడి చేశాడు. ఫలితంగా రెండు రోజుల పాటు జైలులో కూడా ఉండి వచ్చాడు.
మళ్లీ, కొద్దిరోజులుగా ఆ కేసును విత్ డ్రా తీసుకోవాలని హబీబా వెంటపడుతూ ఉన్నాడు. మంగళవారం హబీబా తనకు కాబోయే భర్తతో హిమాయత్ నగర్‌లోని పిజ్జా హట్ రెస్టారెంట్‌కు వచ్చింది. అప్పటికే ఆమెను ఫాలో అవుతున్న అక్బర్ తన మొదటి భార్య అనీజా ఫాతిమాతో కలిసి అదే రెస్టారెంటుకి వెళ్లాడు. ఫాతిమాతో హబీబా వీడియో తీయించాడు. ఇది గమనించిన హబీబా తన వీడియో ఎందుకు తీస్తున్నావంటూ నిలదీసింది. దీంతో అందరూ చూస్తుండగానే అక్బర్ ఆమెపై దాడి చేశాడు. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి అక్బర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..
Also Read: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి