IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Case on PVP: నిర్మాత, వైసీపీ నేత పీవీపీపై కేసు.. ఫిర్యాదు చేసిన డీకే అరుణ కుమార్తె, అసలు గొడవ ఏంటంటే..

బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 7లో ఓ విల్లాను డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి కొనుగోలు చేశారు. ఆ ఇంటికి మరమ్మతులు చేయించడంలో భాగంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారు.

FOLLOW US: 

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్‌లో కేసు నమోదు అయింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పీవీపీపై కేసు పెట్టారు. తన ఇంటి గోడను పీవీపీ అనుచరులు బలవంతంగా కూలగొట్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. పీవీపీ అనుచరులు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 7లో ఓ విల్లాను డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి కొనుగోలు చేశారు. ఆ ఇంటికి మరమ్మతులు చేయించడంలో భాగంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. అయితే శ్రుతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రహరి గోడతో పాటు రేకులను కూడా పీవీపీ అనుచరుడు బాలాజీ, ఇంకొంత మంది ఆయన అనుచరులు జేసీబీతో కూల్చేయించారని శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేంటని నిలదీసినందుకు శ్రుతి రెడ్డిపై వారు బెదిరింపులకు పాల్పడినట్లుగా చెప్పారు. దీంతో పీవీపీతో పాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ, అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేసినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.

ఆ ఫిర్యాదు ఆధారంగా పీవీపీ, ఆయన అనుచరులపై ఐపీసీ 447,427,506,509 r/w34 కింద కేసు నమోదు చేసినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు. 

అయితే, గతంలో పీవీపీ తన రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే వెంచర్ డెవలప్ చేసి విక్రయించారు. ఈ విల్లాలు కొనుక్కున్నవారు తమకు అనుకూలంగా ఇల్లు ఉండేందుకు మార్పులు చేర్పులు చేసుకోవడంతో ఆయన అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఓ రినోవేషన్ చేసుకుంటున్న ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటిని కూలగొట్టినట్టు కేసు నమోదై ఉంది. అప్పట్లో ఆ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపైకి ఆయన కుక్కల్ని వదిలారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తాజాగా అలాంటిదే మరో కేసు నమోదు కావడం చర్చనీయంశంగా మారింది. 

Also Read: E-Cell IIT Hyderabad: వ్యాపారవేత్తగా ఎదగాలని ఉందా? 'ఐఐటీ హైదరాబాద్‌' నిర్వహించే ఈ సదస్సు మీకోసమే!!

Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!

Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్‌ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Jan 2022 07:45 AM (IST) Tags: Hyderabad News banjara hills DK Aruna Daughter Prasad v potluri PVP Cinema Case on PVP

సంబంధిత కథనాలు

Breaking News Live Updates : కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్

Breaking News Live Updates : కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్

Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త

Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త

Hyderabad News : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు, లారీలు బంద్, కొత్త మోటార్ వాహనాల చట్టం రద్దుకు డిమాండ్

Hyderabad News : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు, లారీలు బంద్, కొత్త మోటార్ వాహనాల చట్టం రద్దుకు డిమాండ్

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు