Somireddy: ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో పరిశ్రమను దెబ్బతిస్తారా?
ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై.. కక్షతో సినిమా పరిశ్రమను దెబ్బతీయడం సరికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏపీలో తీసుకున్న సినిమా టికెట్ల రేట్ల అంశంతో.. పరిశ్రమ మూతపడే.. పరిస్థితులు వస్తున్నాయని.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నిత్యావసర వస్తువులు, ఇసుక, ధరలు తగ్గించాలన్నారు. ఎవరో ఇద్దరు, ముగ్గురు సినీ హీరోలపై కక్ష ఉంటే.. దాని కోసం పరిశ్రమను నాశనం చేయడం కరెక్టు కాదని.. సోమిరెడ్డి సూచించారు. అసలు ఆ హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని.. ప్రశ్నించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 125 సినిమా థియేటర్లు మూత పడ్డాయని తెలిపారు. కక్ష సాధించినా.. దానికి హద్దులు ఉంటాయని.. మరి ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో అతిపెద్ద థియేటర్ మూసివేతపై ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా పరిశ్రమ జోలికి పోవద్దని.. సోమిరెడ్డి చెప్పారు. తెలంగాణలో ఎకరానికి రూ.10వేల రైతు బంధు ఇస్తున్నారని.. వీలైతే అలాంటి పథకాలతో పోటీ పడాలి కానీ.. ఇలా చేయడం సరికాదన్నారు. థియేటర్లు మూసివేసే పరిస్థితి రావడం సహించరానిదని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వానికి చేతనైతే నిత్యావసర వస్తువులు, ఇసుక, ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే.. పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలో ఎక్కువ ఉన్నాయని సోమిరెడ్డి అన్నారు. వాటి తగ్గింపుపై దృష్టిపెట్టాలన్నారు.
ఏపీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా.. 125 సినిమా హాళ్లు మూతపడే పరిస్థితి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. బాలీవుడ్‌తో టాలీవుడ్ పోటీ పడాలి అనుకుని ప్రోత్సహించాలి గానీ.. థియేటర్లు మూతపడే పరిస్థితి తీసుకువస్తారా? అని ప్రశ్నించారు. థియేటర్లు ఏమైనా.. మత్తు పదర్థాల తయారీ కేంద్రాలా మూసేందుకు అని అడిగారు. ఓటీఎస్‌పై వస్తున్న తిరుగుబాటును మరల్చేందుకు చేసే కుట్రలో భాగమే ఇది అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: Ayesha Meera Case: సీజేఐకు ఆయేషా మీరా తల్లిదండ్రుల లేఖ... 14 ఏళ్లుగా న్యాయం దక్కడంలేదని ఆవేదన
Also Read: JC Pavan Reddy: అనంత టీడీపీలో ఏం జరుగుతోంది.. జేసీ పవన్ రెడ్డి పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు?
Also Read: ఆశలు వమ్ము చేయను.. తెలుగువాడిగా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తా - జస్టిస్ ఎన్వీ రమణ