By: ABP Desam | Updated at : 26 Dec 2021 05:05 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వంగవీటి రాధా(ఫైల్ ఫోటో)
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కొందరు రెక్కీ చేశారని ఆరోపించారు. గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా పాల్గొన్నారు. ఈ ముగ్గురు నేతలు కలిసి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో ఉద్యేగంగా మాట్లాడిన రాధా... తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారన్నారు. 'నన్ను ఏదో చేద్దాం అనుకునే వారిని చూసి నేను ఎప్పుడు భయపడను. నేను దేనికైనా సిద్ధం. ప్రజల మధ్యే తిరుగుతాను. వంగవీటి రాధా లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలి’’ అని రాధా అన్నారు. రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చను లేవనెత్తాయి. ఎవరినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
Also Read: బెజవాడలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.... మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా, వల్లభనేని వంశీ భేటీ
మంత్రి కొడాలి, రాధా, వంశీ భేటీపై ఆసక్తి
బెజవాడ బెజవాడలో రాధతో వంశీ భేటీ లో వంగవీటి మోహన రంగా 33వ వర్థంతి కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రంగా వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణతో కలసి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. రంగాను కీర్తించారు. రంగా ఆశయాలను సాధిస్తామంటూ మాట్లాడారు. రంగా పేరును పదే పదే ప్రస్తావించారు. సాధారణ ఎన్నికలకు ముందు వంగవీటి రాధాకృష్ణ వైసీపీ నుంచి టీడీపీలో చేరటం సంచలనంగా మారింది. అయితే ఇటీవల అసెంబ్లీ వేదికగా వంశీ చేసిన కామెంట్స్ తో టీడీపీతో పాటుగా ఓ సామాజిక వర్గం కూడా ఆయనపై సీరియస్ గా ఉంది. దీంతో ఇదే సమయంలో రంగా వర్థంతి కార్యక్రమంలో వంశీ పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణతో కలసి నివాళులర్పించారు. ఈ పరిణామాలు ఇప్పడు టీడీపీ, వైసీపీలో తీవ్ర సంచలనంగా మారాయి. వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొనటం రాజకీయంగా కలకలం రేపింది. తాజాగా గుడివాడలో వంగవీటి రాధాకృష్ణ, వల్లభనేని వంశీతో మంత్రి కొడాలి నాని కూడా కలిశారు. ఒక దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు నేతలు కలిసి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: సీజేఐకు ఆయేషా మీరా తల్లిదండ్రుల లేఖ... 14 ఏళ్లుగా న్యాయం దక్కడంలేదని ఆవేదన
Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్
CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>