Visakha Corona Cases: ఉక్కు నగరాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. విశాఖ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. అయితే విశాఖ జిల్లాలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
![Visakha Corona Cases: ఉక్కు నగరాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. విశాఖ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు Corona Cases Increasing In Visakhapatnam District Visakha Corona Cases: ఉక్కు నగరాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. విశాఖ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/a95cd7b6037d5cca15331ea823ed007c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాష్ట్రంలోనే గత 24 గంటల్లో అత్యధిక కేసులు విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయి. పాజివిటిటీ రేటు రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం అత్యధికంగా 1,827 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా విశాఖ నిలిచింది. ఇదిలా ఉండగా నగరంలో గత మూడు రోజులుగా వెయ్యికి పైనే కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 16న 1,028, 17న 1,018 నమోదుకాగా 18 న 1,263 కేసులు (48.45 పాజిటివిటీ రేటు) వచ్చాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,69,013కు చేరింది. ఇందులో 1,58,728 మంది కోలుకోగా, మరో 9137 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
విశాఖ జిల్లాలో ముగ్గురి మృతి
జిల్లాలో కొద్దిరోజులుగా కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ మరణాలు లేకపోవడం కొంత ఉపశమనంగా భావిస్తూ వచ్చారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఇద్దరు, బుధవారం ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ.. మొత్తం మరణాల సంఖ్య 1,117 కు చేరింది.
వైద్య సిబ్బందిని వెంటాడుతున్న కరోనా
వైద్య సిబ్బంది సైతం కొవిడ్ బారిన పడుతున్నారు. మంగళవారం కేజీహెచ్‌లో ఏడుగురు వైద్య సిబ్బందికి కొవిడ్ సోకింది. వీరిలో ఒక సీనియర్ వైద్యుడు, ఇద్దరు పీజీలు, మరో ముగ్గురు నర్సింగ్ సిబ్బంది, ఒక ఎఫ్‌ఎంవో వున్నట్టు చెబుతున్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. ముగ్గురు వైద్యులు, మరో వైద్య అధికారి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఇద్దరు నాలుగో తరగతి సిబ్బందితో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీళ్లు అంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొవిడ్ బారినపడ్డారు. ఆస్పత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్, మరో డాక్టర్, ఇద్దరు నర్సింగ్ స్టాఫ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
Also Read: AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..
Also Read: CS Sameer Sharma: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు
Also Read: Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!
Also Read: ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో పరిశ్రమను దెబ్బతిస్తారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)