News
News
X

Kishan Reddy Letter: సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ, ఈసారి ఏం కోరారంటే !

తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ రాశారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ రాశారు. తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్, జక్రాన్ పల్లి, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి అన్ని అనుమతులున్నాయని, కనుక ఈ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి  ముందుకు రావాలని కేసీఆర్ కు కిషన్ రెడ్డి సూచించారు. గతంలో విమానయాన శాఖ మంత్రి లేఖ రాసినా, తాను లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ కు తాజాగా రాసిన లేఖలో కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

2021 అక్టోబర్ నెలలో పౌర విమానయాన శాఖ మంత్రి ఈ విషయంపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. గతేడాది జూలై 30న నేను కూడా లేఖ రాశాను. అయినా సీఎం స్పందించకపోవడం దురదృష్టకరం. కానీ, ఆ పార్టీ ఎంపీలు మాత్రం.. కేంద్రం ఏం చేస్తోందంటూ పార్లమెంటులో ప్రశ్నలు అడగటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య విమానాశ్రయాల ఏర్పాటుకు చోటుచేసుకున్న ఉత్తర ప్రత్యుత్తరాల విషయాలను కిషన్ రెడ్డి మరోసారి గుర్తుచేశారు. సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విమానాశ్రయాల నిర్మాణానికి ఉన్న అడ్డంకులకు సంబంధించిన సర్వే, భూ పరీక్షలను నిర్వహించిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలకు స్పందిస్తూ 2021 జూలై 6న నివేదిక అందించారు. ఈ నివేదికల ఆధారంగా సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమయ్యే వరంగల్ (బ్రౌన్ ఫీల్డ్), ఆదిలాబాద్ (బ్రౌన్ ఫీల్డ్), జక్రాన్ పల్లి (గ్రీన్ ఫీల్డ్) ప్రాంతాల్లో విమనాశ్రయాల ఏర్పాటుకు వీలుందని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపింది. 

ఆ తరువాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఆ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తెలియజేస్తూ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని లేఖలో తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో 2022 జూలై 30న కిషన్ రెడ్డి సైతం లేఖ ద్వారా రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. కానీ నూతన విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాలేదని, మూడు విమనాశ్రయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

2014లో దేశంలో 74 విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా వీటి సంఖ్య 140కి పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తీసుకొచ్చింది. 2026 నాటికి దేశంలో విమనాశ్రయాల సంఖ్యను 220కి, విమాన మార్గాలను 1000కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం పౌర విమానయానంతో పాటు వస్తు సేవల రవాణాకు ప్రాధాన్యత పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులను సైతం విమనాల ద్వారా రవాణా చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. కనుక తెలంగాణ సైతం విమనాశ్రయాల ఏర్పాటు పట్ల ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మరోసారి లేఖ రాశారు. 

Published at : 15 Feb 2023 09:39 PM (IST) Tags: Kishan Reddy Telangana CM KCR Airports In Telangana Kishan Reddy Letter To KCR

సంబంధిత కథనాలు

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్

MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో అవార్డు - గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీకి గుర్తింపు

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో అవార్డు - గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీకి గుర్తింపు

TSPSC Paper Leak Case: సిట్ ఆఫీసులో ముగిసిన అనితా రామచంద్రన్ విచారణ

TSPSC Paper Leak Case: సిట్ ఆఫీసులో ముగిసిన అనితా రామచంద్రన్ విచారణ

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

టాప్ స్టోరీస్

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు