అన్వేషించండి

Telangana News: రేపటి నుంచి శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్, బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం

Telangana News | రేపటి నుంచి శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్ ను బహిష్కరించాలని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది.

Telangana Assembly Sessions : హైదరాబాద్: డిసెంబర్ 11 నుంచి జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్ పై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ్యుల ఓరియెంటేషన్ సెషన్ బహిష్కరించాలని బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరించారని తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారు. బీఆర్ఎస్ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కేలా వ్యవహరించారు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్తవాళ్లు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా బుధవారం నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికైనా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

చుట్టాల పెండ్లి కోసం సభ వాయిదా

చుట్టాల పెండ్లికోసం చట్టసభలు వాయిదానా ? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం నవ్వులపాలు అవుతోందని బీఆర్ఎస్ అంటోంది. డిసెంబరు 9 నుండి శాసనసభ సమావేశాలు అని గొప్పగా ప్రకటించి పెండ్లి కోసం సభలను వాయిదా వేస్తారా ?! చట్టసభలకు ఇచ్చే గౌరవం ఇదేనా ? అని ప్రశ్నించారు. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఉన్న సభలను కేవలం సీఎం ఒక్కరి కోసం వాయిదా వేస్తారా ?. అయినా తెలంగాణ అస్థిత్వాన్ని గౌరవించలేనోళ్లు ఇక చట్టసభలను ఏం గౌరవిస్తారు అని ఎద్దేవా చేశారు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందన్నట్లుగా, ఏడాది కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఎక్కే విమానం .. దిగే విమానం అన్నట్లు మారిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ గమనిస్తుంది, తెలంగాణ సమాధానం ఇస్తుందన్నారు.

ఆశా కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్ సర్కార్‌కు సంవత్సరం పూర్తయిన సందర్భంగా తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడగడానికి వస్తే ఆడబిడ్డలని చూడకుండా నడిరోడ్డు మీద మగ పోలీసులతో దాడి చేయించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి లాంటి కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకు సేవలందించిన ఆశా వర్కర్లపై కాంగ్రెస్ సర్కార్ దమన కాండను చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయిందన్నారు.

నిన్న పోలీసుల దాడిలో గాయపడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్ల (Asha Workers)ను కేటీఆర్ పరామర్శించారు. వారి పోరాటానికి మద్దతు తెలిపి, ధైర్యం చెప్పారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఆయన వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, తదితరులు ఉన్నారు.

Also Read: Mohanbabu to Manoj: భార్య మాటలు విని గుండెల మీద తన్నావు - నా ఆస్తి నా ఇష్టం - మనోజ్‌కు తేల్చి చెప్పిన మోహన్ బాబు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget