Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ప్లానింగ్ టూ ఓపెనింగ్, సమస్త సమాచారం ఇక్కడ తెలుసుకోండి
నేడు (ఏప్రిల్ 30) ప్రారంభం కాబోతున్న తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయానికి సంబంధించి సకల సౌకర్యాలు, ప్రత్యేకతలు ఇతర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
కొత్త సచివాలయం కట్టడానికి అసలు కారణం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం దృష్టికి వచ్చింది. తరుచూ పై కప్పు పెచ్చులు ఊడిపడడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తడం, అన్ని వసతరులతో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం లేమి, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులతో పాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాత సచివాలయం స్థానంలోనే రాష్ట్ర పాలనకు కేంద్రమైన కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇంకా చదవండి
దేశంలోనే ఎత్తైనది, మొత్తం ఎన్ని గదులున్నాయో తెలుసా!
కరోనా, కోర్టు కేసులు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులు 2021 జనవరిలో ప్రారంభమయ్యాయి. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో భవనం నిర్మించారు. ఇంత ఎత్తైన సచివాలయం ఏ రాష్ట్రంలోనూ లేదు. కొత్త సచివాలయం భిన్న సంస్కృతుల సమ్మేళనం. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి. భవనం పైన ఏర్పాటుచేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. పనులు మొదలయ్యాక 26 నెలల రికార్డు సమయంలో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంత భారీ నిర్మాణానికి సాధారణంగా ఐదేళ్ళైనా పడుతుంది. కానీ రెండేళ్లలోనే ఫినిష్ చేశారు. ఇంకా చదవండి
కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు
సరికొత్త పాలనా సౌధం సకల హంగులతో రూపుదిద్దుకుంది! ముఖ్యంగా సెక్యూరిటీ కోణంలో చూస్తే అదొక రక్షణ దుర్గం! శత్రువుకు అందని భవనం! చీమచిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత వలయం! డేగకళ్లతో పహారా కాస్తుంటారు. భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశిస్తారు. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహారా కాస్తారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్టమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకులు ఫేస్ రికగ్నిషన్ ద్వారా వారి సమాచారం ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తివివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇంకా చదవండి
కొత్త సచివాలయం బేస్మెంట్ కోసం ఒక గని మొత్తం తరలింపు!
సచివాలయ నిర్మాణాల్లో మరో ప్రత్యేకత ధోల్ పూర్ రెడ్ స్టోన్! సెక్రటేరియట్ బేస్మెంట్ కోసం మొత్తం ఎర్రరాతినే వాడారు. దాన్నే పార్లమెంటు భవనానికి వినియోగించారు. ధోల్ పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3,500 క్యూ.మీ. పరిమాణంలో వాడారు. ఇందుకోసం రాజస్థాన్ ఏకంగా ఓ గని మొత్తాన్ని వినియోగించారు. అక్కడి నుంచి వేయి లారీల్లో రాయిని హైదరాబాదుకు తరలించారు. బేస్మెంట్ మొత్తానికి ఎర్రరాయిని వాడగా, ప్రధాన గుమ్మటం నుంచి పోర్టికో వరకు లేత గోధుమ రంగు స్టోన్ వాడారు. స్తంభాలు ఇతర భాగాల్లో ప్రత్యేక నగిషీ ఆకృతుల కోసం గాల్వనైజ్డ్ రీ ఇన్ ఫోర్స్ డ్ కాంక్రీట్ పద్ధతిలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ డెకొరేషన్ చేయించారు. తద్వారా దేశంలో ఈ స్థాయిలో జీఆర్సీ చేసిన తొలి భవనంగా సచివాలయం నిలిచింది. ప్రధాన పోర్టికో ఎత్తు 42 అడుగులు. అంత ఎత్తుతో భారీ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భవనంలో ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తుతో నిర్మించారు. భవనంలో మొత్తం 24 లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కై లాంజ్ వరకు వెళ్లేందుకు రెండు వైపులా 4 లిఫ్టుల చొప్పున 8 లిఫ్టులున్నాయి. ఇంకా చదవండి
కొత్త సచివాలయం 6 ఫ్లోర్లే, కానీ చూడ్డానికి 11 అంతస్తులుగా - ఎందుకిలా?
పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా ఈ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణం జరిగింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసి తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ఏప్రిల్ నెలాఖరు నాటికి సరిగ్గా 26 నెలల సమయం పూర్తవుతుంది. ఆర్ అండ్ బి శాఖ ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్), టిఎస్ టెక్నలాజికల్ సర్వీసెస్, రాష్ట్ర పోలీసు విభాగాల సూచనలతో ఎలాంటి లోపం లేకుండా ఈ భవన నిర్మాణం జరిగింది. దేశంలోని చారిత్రక కట్టడాల కన్నా దీనిని ఎక్కువ ఎత్తులో నిర్మించారు. అందులో రెండుసార్లు 45 రోజుల చొప్పున కరోనాతో పనులు ఆగిపోయాయి. అయినా కార్మికులను ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మొదటగా ఈ నిర్మాణం ప్రారంభించినప్పుడు 1500 మందితో ప్రారంభమై చివరకు 4000 మంది కార్మికులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు. ఇంకా చదవండి
సచివాలయం కోసం రాళ్లెత్తిన కూలీలకు కేసీఆర్ సెల్యూట్!
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడింపజేసేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని సీఎం అన్నారు. డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవ శుభ సందర్భంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక అపోహలు సృష్టించి చేసిన విమర్శలు, అడ్డంకులను దాటుకుంటూ దృఢ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం, అనతికాలంలోనే దేశానికే వన్నె తెచ్చేలా పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. ఇంకా చదవండి