News
News
వీడియోలు ఆటలు
X

Telangana Secretariat News: సచివాలయం కోసం రాళ్లెత్తిన కూలీలకు కేసీఆర్ సెల్యూట్! అందరికీ ధన్యవాదాలు

వినూత్న రీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని సీఎం అన్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడింపజేసేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని సీఎం అన్నారు. డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవ శుభ సందర్భంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక అపోహలు సృష్టించి చేసిన విమర్శలు, అడ్డంకులను దాటుకుంటూ దృఢ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం, అనతికాలంలోనే దేశానికే వన్నె తెచ్చేలా పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు.

చూస్తేనే కడుపు నిండిపోతోంది- సీఎం కేసీఆర్

భవిష్యత్తు తరాల పరిపాలన అవసరాలనూ దృష్టిలో వుంచుకుని అత్యంత గొప్పనైన సాంకేతిక విలువలతో కూడిన నిర్మాణ కౌశలంతో సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూ, అనేక విశిష్టతలతో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడమని ప్రశంసించారు. ప్రశాంతతను ప్రసాదించే దేవాలయం మాదిరి, చూస్తేనే కడుపు నిండే విధంగా అత్యంత ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా నిర్మితమైన సచివాలయం, ప్రభుత్వ యంత్రాంగ పనితీరును గొప్పగా ప్రభావితం చేస్తూ గుణాత్మక మార్పుకు బాటలు వేస్తుందన్నారు. మార్పునకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ, ప్రజా ఆకాంక్షలకు అనుకూలంగా మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, వాటిని సాకారం చేసే దిశగా సుపరిపాలన కొనసాగేలా సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని సిఎం అన్నారు.

అందుకే అంబేద్కర్ పేరు పెట్టాం- సీఎం కేసీఆర్

ఒక రాష్ట్ర సచివాలయానికి డా. బిఆర్. అంబేద్కర్ పేరును పెట్టడం దేశంలోనే మొదటిసారి అని సిఎం కేసీఆర్ గుర్తుచేశారు. అంబేద్కర్ మహాశయుని పేరుపెట్టుకోవడం వెనక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, పేద వర్గాలకు సమాన హక్కులు దక్కాలనే సమున్నత లక్ష్యమున్నదని సీఎం అభిప్రాయపడ్డారు. ఎదురుగా తెలంగాణ అమరుల స్మారక జ్యోతి, పక్కనే ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ మహాశయుడు రేపటికి దిక్సూచిగా నిలిచి, నిరంతరం ఒక స్ఫూర్తిని రగిలిస్తుండగా, తెలంగాణ పాలనా సౌధం నుంచి జాతిమెచ్చే సుపరిపాలన రాష్ట్ర ప్రజలకు అందాలనే మహోన్నత లక్ష్యంతో అంబేద్కర్ మహాశయుని పేరును సచివాలయానికి పెట్టామన్నారు.

ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు- సీఎం కేసీఆర్

దేశంలో అత్యంత చిన్న వయసున్న రాష్ట్రంగా, ఇతర రాష్ట్రాలతో పోల్చితే,  తెలంగాణ సకల జనుల సంక్షేమ పాలనను దేశానికి ఆదర్శంగా అందిస్తున్నదని సిఎం కేసీఆర్ అన్నారు. అనతికాలంలోనే దేశానికే తెలంగాణ పాలన వొక మోడల్ గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా విస్తరించేలా తెలంగాణ పాలన నూతన సచివాలయం నుంచి ద్విగుణీకృతమౌతుందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభ దేదీప్యమానమయ్యేలా, దార్శనికతతో సాధించిన ప్రగతి వెలుగుల దారిలో,  ప్రస్థానం మహోన్నతంగా కొనసాగుతుందని సిఎం కేసీఆర్ తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌నరి అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో అమోఘమైన పాత్ర పోషించిన, రాళ్లెత్తిన కూలీలను, మేస్త్రీలను, నిర్మాణంలో కష్టించి పనిచేసిన అన్ని వృత్తుల నిపుణులను, అపురూపంగా మోడల్ అందించిన ఆర్కిటెక్టులను, విరామమెరుగక రేయింబవళ్లు పనిచేసిన కాంట్రాక్టు ఏజెన్సీలను, వారి ఇంజనీర్లను, ఆర్ అండ్ బి శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను, ఇంజనీర్లను, సిబ్బందిని, నిర్మాణంలో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా సీఎం కేసీఆర్ అభినందించారు.

Published at : 30 Apr 2023 07:20 AM (IST) Tags: Telangana Secretariat chief minister kcr Self-respect of the people Telangana community Dr. Br. Ambedkar Telangana Secretariat Prosperity to the country

సంబంధిత కథనాలు

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

BRS News: బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు, మధ్యప్రదేశ్ కీలక వ్యక్తి కూడా

BRS News: బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు, మధ్యప్రదేశ్ కీలక వ్యక్తి కూడా

Civils Coaching: సివిల్స్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!

Civils Coaching: సివిల్స్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!

టాప్ స్టోరీస్

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!