అన్వేషించండి

AP Cabinet decisions: ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

CM Chandrababu: ఏపీ మంత్రి వర్గ సమావేశంలో 70 అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో ఐటీ కంపెనీల కోసం రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు.

Andhra Pradesh cabinet decisions:  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో సుమారు 70 అజెండా అంశాలపై విస్తృత చర్చ జరిపి నిర్ణయాలు తీసుకున్నారు.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన  జరిగిన ఈ సమావేశం మూడున్నర గంటలపాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై విస్తృత చర్చ జరిగింది. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపు, పరిశ్రమల స్థాపనలో భూ కేటాయింపుకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ వంటి కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొంధా తుఫాను సమయంలో మంత్రులు, అధికారుల చొరవలను సీఎం అభినందించారు.         

మొంథా తుపాను సమయంలో కష్టపడి పని చేసిన మంత్రులు

సమావేశంలో అజెండాలపై చర్చించిన తర్వాత, వివిధ అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. మొంధా తుఫాను సమయంలో ప్రతి మంత్రి క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సహాయం అందించారని, అధికారులతో సమన్వయంతో చర్యలు వేగంగా అమలు చేశారని సీఎం ప్రశంసించారు. ఆర్‌టీజీఎస్  నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించగలిగామని చెప్పారు. "సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అందరూ కలిసి కష్టపడి పనిచేశారు, స్వయంగా చూశాను" అంటూ మంత్రులను అభినందించారు.  

ఏపీ నైబర్ హుడ్ పాలసీకి ఆమోదం - క్వాంటం కంప్యూటింగ్ పాలసీకి ఓకే 
  
రాజధాని అమరావతిలో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇది ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడానికి సహాయపడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది.  క్యాపిటల్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.  అలాగే ఏఐపీబీ సమావేశంలో ఆమోదించిన రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌.. విశాఖలో ఐటీ కంపెనీలకు రోడ్డు విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు.                          

విశాఖలో కొన్ని సంస్థలకు భూముల కేటాయింపు                        

విశాఖలో క్వార్క్స్‌ టెక్నోసాఫ్ట్‌ ఐటీ క్యాంపస్‌కు 2 ఎకరాల కేటాయించారు.  ఫ్లూయెంట్‌గ్రిడ్‌ ఐటీ క్యాంపస్‌కు 3.3 ఎకరాలు కేటాయించారు.  రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం.  సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, పేదలందరికీ ఇళ్లు కేటాయించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. "నివాస స్థలం లేని ప్రతి కుటుంబానికి ఇల్లు దక్కేలా జాబితా రూపొందించండి. ప్రభుత్వ చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోండి" అని చెప్పారు.రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. "త్వరత్గతిన సమస్యలు పరిష్కరించే సరైన విధానాలు రూపొందించాలి. రైతులు, పౌరుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి" అని ఆదేశించారు. మొంధా తుఫాను సమయంలో మంత్రులు, అధికారుల సమన్వయం ద్వారా ప్రాణ నష్టాలు తగ్గాయని, ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కొనసాగాలని సూచించారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
FIFA World Cup 2026 : FIFA ప్రపంచ కప్ 2026  సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?
FIFA ప్రపంచ కప్ 2026 సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
OTT Spy Movies: 'ధురంధర్' సినిమా కన్నా ముందుగా  ఈ స్పై థ్రిల్లర్స్ చూడండి, ఈ OTT ల్లో అందుబాటులో ఉన్నాయ్!
'ధురంధర్' సినిమా కన్నా ముందుగా ఈ స్పై థ్రిల్లర్స్ చూడండి, ఈ OTT ల్లో అందుబాటులో ఉన్నాయ్!
Advertisement

వీడియోలు

Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
FIFA World Cup 2026 : FIFA ప్రపంచ కప్ 2026  సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?
FIFA ప్రపంచ కప్ 2026 సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
OTT Spy Movies: 'ధురంధర్' సినిమా కన్నా ముందుగా  ఈ స్పై థ్రిల్లర్స్ చూడండి, ఈ OTT ల్లో అందుబాటులో ఉన్నాయ్!
'ధురంధర్' సినిమా కన్నా ముందుగా ఈ స్పై థ్రిల్లర్స్ చూడండి, ఈ OTT ల్లో అందుబాటులో ఉన్నాయ్!
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Virat Kohli Records: సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్
సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్
Sonarika Bhadoria : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ - కపుల్‌కు వెల్లువెత్తుతున్న విషెష్
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ - కపుల్‌కు వెల్లువెత్తుతున్న విషెష్
Virat Kohli Viral Video: సింహాచలం అప్పన్న సన్నిధిలో విరాట్ కోహ్లీ.. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న క్రికెటర్లు
సింహాచలం అప్పన్న సన్నిధిలో విరాట్ కోహ్లీ.. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న క్రికెటర్లు
Embed widget