KTR Tweet: ఏదో అలా అనేశాను- బాధపడకండీ, ఏపీని ఉద్దేశించి చేసిన కామెంట్స్‌పై కేటీఆర్‌ ట్వీట్‌

KTR Tweet On AP CM YS Jagan: ఆ ట్వీట్‌లో వి వరణ ఉంది. పరిస్థితిని శాంతింపజేసే మార్గం కనిపిస్తుంది. అంతే స్థాయిలో తమపై వచ్చిన నెగటివ్ కామెంట్స్‌కు రియాక్షన్ కూడాఉంది. మూడు షేడ్స్‌ ఉన్న మెసేజ్‌ను కేటీఆర్‌ పోస్టు చేశారు.

FOLLOW US: 

తెలంగాణ ఐటీశాఖ కేటీఆర్ కామెంట్స్ ఓ రేంజ్‌లో ఏపీ రాజకీయాలను కుదిపేశాయి. కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్‌పై తెలంగాణలో పాలనపై విమర్శలు చేశారు.  

జల వివాదాల్లో కొందరు నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది కానీ.. ఈ స్థాయిలో ఎప్పుడూ ఫైట్ జరగలేదు. పొరుగు రాష్ట్రాలు అంటూ కేటీఆర్ సీరియస్ విమర్శలు చేయడం... ఎక్కడా ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తకుండానే అక్కడి సమస్యలు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. 

కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై వైసీపీ నుంచి కూడా గట్టిగానే రియాక్షన్ కనిపించింది. తెలంగాణలో ఉన్న సమస్యలను ఎత్తి చూపే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షంలో ఒక్కరంటే ఒక్కరు కూడాప్రభుత్వానికి సపోర్ట్ చేయలేకపోయారు. తాము ఎప్పటి నుంచో చెబుతున్న వాటినే కేటీఆర్ ఇప్పుడు చెప్పారని కూడా కామెంట్స్ చేశారు. 

సోషల్ మీడియాలో అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అనుకూల,  ప్రభుత్వ వ్యతిరేక వర్గాల మధ్య చిన్నసైజ్ వార్ నడిచింది. వ్యతిరేక వర్గీయులు కేటీఆర్ కామెంట్స్‌ను షేర్ చేశారు. వైసీపీ మద్దతుదారులు తెలంగాణలో ఉన్న సమస్యలను, అక్కడ పత్రికల్లో వచ్చిన నెగటివ్ వార్తలను షేర్ చేశారు. 

ఇలా మాటల తూటాలు, విమర్సల జడివాన కురుస్తూ పరిస్థితులు భారీ తుపానును తలపిస్తున్న టైంలో కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. పరిస్థితిని కూల్ చేయడానికి రెడీ అయినట్టు ఆ ట్వీట్ చూస్తే అనిపిస్తుంది. అయితే చూడటానికి అది కాస్త శాంతింప జేసేదిలా ఉన్నప్పటికీ అందులో వెటకారం కూడా కనిపిస్తోంది. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే... తాను చేసిన కామెంట్స్‌కు చాలా మంది ఏపీ మిత్రులు బాధపడ్డారని... ఇప్పటికీ జగన్‌తో తనకు మంచి స్నేహం ఉందని... ఆయన నాయకత్వంలో ఏపీ మంచి పురోభివృద్ధి సాధించాలని ట్వీట్ చేశారు. ఇది చదివితే ఎక్కడా పరిస్థితిని కూల్ చేసినట్టు కనిపిస్తుంది. తమను దూషిస్తున్న వైసీపీ లీడర్లకు కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  మరి వైసీపీ లీడర్లు కేటీఆర్‌ మెసేజ్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 

ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని విమర్శలకు దారి తీస్తుందో... లేకుంటే ఎందుకు విమర్శలు చేసి ఇబ్బంది పాలవడం వదిలేయండని వైసీపీ లీడర్లు అంటారో చూడాలి.

Published at : 30 Apr 2022 07:06 AM (IST) Tags: telangana ANDHRA PRADESH YSRCP Twitter KTR

సంబంధిత కథనాలు

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !

Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

Chiranjeevi - Rajendraprasad Tribute To NTR: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్ 

Chiranjeevi - Rajendraprasad Tribute To NTR: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్ 

Balakrishna About NTR: ఎన్టీఆర్‌కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం

Balakrishna About NTR: ఎన్టీఆర్‌కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం