Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Telangana : హైడ్రాకు చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇక హైడ్రాకు తిరుగుండని అంచనా వేస్తున్నారు.
Telangana government HYDRA : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు చట్టబద్ధతపై అనేక సందేహాలు ఉన్నాయి. కోర్టుల్లో పిటిషన్ల కూడా దాఖలయ్యాయి. దీంతో హైడ్రా దూకుడు తగ్గింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా హైడ్రా ఏం చేయబోతుందో చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రాకు ఫుల్ వపర్స్ ఇచ్చేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించడం ద్వారా పూర్తి స్థాయి చట్టబద్ధ సంస్థగా మారనుంది.
జలవనరులను కాపాడమే లక్ష్యం
హైదరాబాద్‌లో చెరువులు, కాల్వలు, కుంటల ఆక్రమణలను తొలగించటని హైడ్రా ప్రదాన ఉద్దేశం. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ఆయా శాఖలకు అప్పగించటంతో పాటు మళ్ళీ ఆక్రమణలు జరగకుండా జలవనరులను కాపాడేందుకు ముఖ్యమంత్రి రేంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. గతంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేయటం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు. అయితే హైడ్రా ఏర్పాటు చట్టబద్దంగా లేదు కాబట్టి.. నోటీసులు ఇవ్వడం. . కూల్చి వేయడానికి అధికారాలు ఉండవని వాదిస్తూ వస్తున్నారు. కోర్టుల్లో కూడా కేసులు పడటంతో తాత్కలికంగా హైడ్రా దూకుడు తగ్గింది. చట్టబద్ధత కల్పించే దిశగా.. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు.
రీజనల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పుపై సీబీఐ విచారణకు బీఆర్ఎస్ డిమాండ్
అసెంబ్లీలో బిల్లు పాసవ్వాలి !
క్యాబినెట్ తీర్మానం అయినంత మాత్రాన హైడ్రాకు చట్టబద్దత వచ్చినట్లు కాదని చెప్పుకోవచ్చు. చట్టం చేస్తేనే చట్టబద్ధత ఉన్నట్లు. చట్టబద్దత ఇవ్వటానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి పాస్ చేస్తుంది. ఆ తర్వాత గవర్నర్ గెజిట్ జారీ చేస్తే హైడ్రాక తిరుగు ఉందు. ఒకవేళ సమావేశాల నిర్వహణ ఆలస్యమైతే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. హైడ్రాకు ప్రభుత్వం చాలా కీలకమైన బాధ్యతలను ఇస్తోంది. మూసీ నది ప్రక్షాళన, చెరువులు, కాల్వలతో పాటు కుంటలను ఆక్రమించిన మరిన్ని నిర్మాణాలను తొలగించాల్సిన మిషన్ హైడ్రాకు ఇస్తోంది. హైడ్రాకు 169 మంది సిబ్బందిని ఇవ్వాలని నిర్ణయించారు.
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
మార్కింగ్ చేసినవన్నీ కూల్చేయడమే !
ఇప్పటికే హైడ్రా చెరువులకు సంబంధించి పూర్తి సమాచరాంతో మార్కింగ్ చేసుంది. ప్రభుత్వ భూములు , ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలన్నింటినీ వరుసగా కూల్చిచేయనున్నారు. కూల్చి వేసిన వాటిని తొలగించడానికి ప్రత్యేకంగా టెండర్లు పిలుస్తున్నారు. ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. అంటే ఇక నోటీసులు.. కేసులు.. కూడా హైడ్రా నమోదు చేయగలదు. అందుకే.. వచ్చే కొద్ది రోజుల్లో హైడ్రా తన మార్క్ ను హైదరాబాద్ చుట్టూ చూపిస్తుందని భావిస్తున్నారు.