అన్వేషించండి

Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!

Bonus For SCCLs coal workers | తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ భారీ బోనస్ ప్రకటించింది. గత ఏడాది కంటే దసరా బోనస్ గా రూ.20 వేలు అధికంగా ఇస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను దసరా బోనస్ గా ప్రకటించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త అందించింది. రూ.4,701 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ లో రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు పంచుతున్నాం. ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి 1 లక్షా 90వేలు బోనస్ ఇస్తున్నాం. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇస్తాం. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటి సారి. గత ఏడాది కంటే 20 వేలు అధికంగా బోనస్ ఇచ్చాం. సింగరేణి లాభాల్లో 33 శాతం వాటాను కార్మికులకు బోనస్ గా అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు సైతం తమ వంతు పాత్ర పోషించారు’ అని వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దాంతో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటిస్తున్నాం. దసరా కంటే ముందుగానే సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనుకున్నాం. 

ఏడాది సింగరేణి మొత్తం ఆదాయం రూ.4,701 కోట్లు

సింగరేణి సంస్థ రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల‌తో పాటు ఇత‌ర సంస్థ‌ల‌కు, ఇత‌ర రాష్ట్రాల‌కు బొగ్గు ఎగుమ‌తి చేస్తోంది. సింగ‌రేణి కార్మికులు 2023-24 సంవ‌త్స‌రంలో సంస్థ‌కు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం చేకూర్చారు. ఇందులో సంస్థ విస్త‌ర‌ణ‌, పెట్టుబ‌డుల‌కు రూ.2,289 కోట్లు కేటాయించారు. మిగిలిన‌ మొత్తం రూ.2,412 కోట్లు కాగా, ఇందులో నుంచి మూడో వంతు రూ.796 కోట్ల‌ను కార్మికుల‌కు దసరా బోన‌స్‌గా తెలంగాణ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. సింగ‌రేణిలో  41,387 మంది శాశ్వ‌త కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. గ‌తేడాది సింగ‌రేణి కార్మిల‌కు అందిన బోన‌స్‌ రూ.1.70 ల‌క్ష‌లు కాగా, ఈ ఏడాది ఒకొక్క‌రికి బోన‌స్ కింద రూ.1.90 ల‌క్ష‌లు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

సింగ‌రేణి సంస్థ ఆర్జించిన లాభాల‌ను పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. రామ‌గుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, సోలార్ విద్యుదుత్ప‌త్తి కేంద్రాన్ని 1000 మెగావాట్ల‌కు విస్త‌రించ‌డం, రామ‌గుండంలో టీఎస్ జెన్ కో ఆధ్వ‌ర్యంలో మ‌రో 1x800 మెగావాట్ల థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం, జైపూర్‌లోని ప్ర‌స్తుత థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రంలో మ‌రో 1x800 మెగావాట్ల సామ‌ర్థ్యంతో మరో కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన (పిట్‌హెడ్‌) 2,400 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సంస్థ ప‌రిధిలోని వీకే ఓపెన్ కాస్ట్‌, గోలేటీ, నైనీ ఓసీల‌ను ప్రారంభిస్తామ‌ని, సింగ‌రేణి కార్మికులు, ఉద్యోగుల పిల్ల‌ల కోసం నూత‌న రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌, ఏరియా ఆసుప‌త్రుల ఆధునికీక‌ర‌ణ‌తో పాటు హైద‌రాబాద్‌లో మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఉప ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. మ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి భారీ సాయం
వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి ఉద్యోగులు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. సింగరేణి కార్మికులు తమ ఒకరోజు వేతనం రూ.10.25 కోట్లను తెలంగాణ సీఎ సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి కాలరీస్‌ వర్కర్క్‌ యూనియన్‌ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ జనరల్‌ సెక్రటరీ జనక్‌ ప్రసాద్, సింగరేణి సీఎండీ బలరాం, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌లు సెప్టెంబర్ 19న కలిసి అందజేశారు. దాంతోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం రూ.2.50 లక్షలను వరద బాధితుల కోసం విరాళం అందించారని తెలిసిందే.

Also Read: Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు - 14 రోజుల రిమాండ్

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget