అన్వేషించండి

Congress Bus Yatra: ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర, హాజరుకానున్న ఖర్గే, ప్రియాంక, రాహుల్

Congress Bus Yatra: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ నెల 15వ తేదీ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు.

Congress Bus Yatra: ఈ నెల 14వ తేదీ తర్వాత ఏ క్షణమైనా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడుతుందన్న అంచనాల వేళ.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తలపెట్టిన బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. ఈ బస్సు యాత్రను ప్రారంభించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రానున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీన లేదా 10వ తేదీన జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో షెడ్యూల్, రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు టికెట్ల విషయంపై బిజీబిజీగా ఉంటున్నారు. ఇదిగో జాబితా, అదిగో జాబితా అంటున్నప్పటికీ.. అభ్యర్థుల ఎంపిక మరింత ఆలస్యం అవుతూనే ఉంది. రెండు దఫాలు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు పూర్తి అయిన నేపథ్యంలో.. టికెట్ల ప్రకటన ఈ నెల 14వ తేదీ తర్వాతే తొలి జాబితా ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలోనే తొలి జాబితా విడుదల చేసేలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు కసరత్తు చేశారు. అయితే స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఇంకా జరగాల్సి ఉండటం, కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఇంకా జరగకపోవడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. అలాగే పితృపక్షాల కారణంగా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో కూడా అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 14వ తేదీన అమావాస్య ఉండటంతో ఆ తర్వాతే అభ్యర్థుల తొలి జాబితా ఉంటుంది పీసీసీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఇందుకోసం ఈ నెల 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుందని, ఆ తర్వాత 10న సీఈసీ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.

మరోవైపు స్క్రీనింగ్ కమిటీ ఒక్కో పేరు పంపిన నియోజకవర్గాలకే తొలుత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. రెండు, మూడు పేర్లు పంపిన సెగ్మెంట్లకు సంబంధించి ఒక్కో పేరును ఫైనల్ చేసేందుకు సీఈసీ కొన్ని మార్గదర్శకాలు ఇస్తుందని, ఆ మార్గదర్శకాల మేరకు మళ్లీ స్క్రీనింగ్ కమిటీనే ఒక్కో పేరు సూచించాల్సి వస్తుందనే చర్చ ఏఐసీసీ వర్గాల్లో జరుగుతోంది.

శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో ఖర్గే, వేణుగోపాల్ లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు తెలంగాణలో ఏఐసీసీ కీలక నేతల పర్యటనలపై చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీలున్నన్ని ఎక్కువసార్లు ప్రియాంక, రాహుల్ గాంధీలతో పాటు ఖర్గే కూడా రాష్ట్రానికి వచ్చేలా షెడ్యూల్ ఇవ్వాలని, కీలక సమయంలో మరోమారు సోనియా గాంధీ కూడా పాల్గొనేందుకు అనుమతి ఇప్పించాలని రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఈ నెల 15 తర్వాత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget