అన్వేషించండి

Swaero Praveen Kumar: రాజకీయాల్లోకి మరో సివిల్ సర్వీస్ ఆఫీసర్..! కానీ చరిత్ర చెబుతున్నదేంటి..?

అనుకున్నట్టుగానే ప్రవీణ్ కుమార్ రాజకీయల వైపు మొగ్గుతున్నారు. దళితల విద్యార్థులకు రోల్ మోడల్ గా ఉన్న ఆయన... ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీకి అడుగులేస్తున్నారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి తన లేఖ పంపారు.  గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. అయినా వదులుకోవాలని డిసైడయ్యారు. అయితే ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏమిటో స్పష్టంగా రాలేదు కానీ.. రాజకీయంపై ఆలోచన ఉందని మాత్రం..  తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన లేఖ చివరి వాక్యాలు చూస్తే అర్థమైపోతుంది. 

కొత్త పార్టీతోనా... కారుతోనా?

ఆర్,.ఎస్. ప్రవీణ్ కుమార్ కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నానని ఆయన సన్నిహితులకు చెబుతున్నారు. జైభీమ్ పార్టీ పెడతారని.. ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయనను టీఆర్ఎస్ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా  ముందస్తుగా పదవీ విరమణ చేయిస్తోందని.. హుజూరాబాద్ నుంచి ఆయనను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని మరోవైపు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన ఆలంపూర్‌కు చెందిన వారు. హుజూరాబాద్‌కు నాన్ లోకల్ అవుతారు. అయితే.. స్వేరో ఉద్యమంతో ఆయన అన్ని చోట్లా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. ఐపీఎస్ అయినప్పటికీ.. చాలా కాలంగా... ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో  పోలీసు శాఖకు సంబంధం లేని ఉద్యోగం చేస్తున్నారు.  ఆయన క్యాడర్ అదనపు డీజీపీ. అయితే ఆయన తొమ్మిదేళ్లుగా గురుకుల పాఠశాలల వ్యవహారాలను చూస్తు్న్నారు. గురుకులాల విషయంలో ఆయన సంస్కరణలు తీసుకు వచ్చారు. స్వేరో పేరుతో.. ఓ రకమైన సమాంతర వ్యవస్థను నెలకొల్పారు. ఈ వ్యవస్ధ ద్వారా దైవదూషణకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో  కూడా కలకలకానికి కారణం అయింది. ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. సర్వీస్ నుంచి వైదొలగాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే ... ఆ దైవదూషణతో తనకు సంబంధం లేదని సమర్థించుకున్నారు. 

రావడం మాత్రం పక్కా

ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా తెలంగాణ సర్కార్ మాత్రం పెద్దగా స్పందించలేదు. ఆయనపై ఎలాంటి వ్యతిరేక చర్యలు కానీ.. వ్యాఖ్యలు కానీ చేయలేదు. కనీసం పోస్టింగ్ కూడా మార్చలేదు. ఇప్పుడు నేరుగా ఆయనే సర్వీస్ నుంచి వైదొలిగారు. త్వరలో పార్టీ పెడతారో.. లేకపోతే టీఆర్ఎస్‌లో చేరుతారో కానీ... రెండింటిలో ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఆయన రాజకీయ ఆకాంక్షలతోనే సర్వీసు వదులుకుంటున్నారని చెప్పక తప్పదు. ప్రస్తుతం హూజూరాబాద్ ఎన్నికలు జరుగుతూండటంతో..   ఆయన పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. 

హిస్టరీ చెబుతున్నదే వేరు!

అయితే సివిల్ సర్వీస్ అధికారులు రాజకీయాల్లో సక్సెస్ కావడం అనేది చాలా స్వల్పంగా ఉంది. రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. గెలుపొందడం.. లేదా ఓడిపోవడం వంటి సివిల్ సర్వీసు అధికారుల గురించి పక్కన పెడితే..  విధి నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. రాజకీయం వైపు అడుగులేసిన వారు పెద్దగా ఎక్కడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. జయప్రకాష్ నారాయణ చాలా కాలం పాటు లోక్ సత్తా ఉద్యమాన్ని నడిపి.. రాజకీయ పార్టీగా మార్చారు. చివరికి ఆయన అవమానభారంతో  మళ్లీ లోక్ సత్తాను ఉద్యమ సంస్థగా మార్చేశారు. ఇప్పుడు ఆ పార్టీ లేదు. ఇక సీబీఐ జేడీగా ప్రత్యేక గుర్తింపు పొందిన వీవీ లక్ష్మి నారాయణ కూడా.. రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారు. ఆయన ఇప్పుడు మళ్లీ తన స్వచ్చంద సేవ వైపు వెళ్లారు. ఇప్పుడు.. స్వేరో ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ కుమార్.. రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారో.. ఎలాంటి ఫలితాలు వస్తాయో.. ఆసక్తికరమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget