Summer Special Trains: తెలుగు రాష్ట్రాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలు ఇవిగో!
Special Trains News: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రకు కూడా ఈ స్పెషల్ రైళ్లు ఉన్నాయి.
South Central Railway: ఎండాకాలంలో స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు సెలవులు కావడంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఒక్క తమ పరిధిలోనే 48 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రకు కూడా ఈ స్పెషల్ రైళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 8 నుంచి మే 29 వరకూ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
1. రైలు నెంబరు 07517. సికింద్రాబాద్ - నాగర్ సోల్ (ప్రతి బుధవారం మాత్రమే) ఏప్రిల్ 17 నుంచి మే 29 వరకూ ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
2. రైలు నెంబరు 07518. నాగర్ సోల్ - సికింద్రాబాద్ (ప్రతి గురువారం మాత్రమే) ఏప్రిల్ 18 నుంచి మే 30 వరకూ ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
3. రైలు నెంబరు 07121. తిరుపతి - మచిలీపట్నం (ప్రతి ఆదివారం మాత్రమే) ఏప్రిల్ 14 నుంచి మే 26 వరకూ ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
4. రైలు నెంబరు 07122. మచిలీపట్నం - తిరుపతి (ప్రతి సోమవారం మాత్రమే) ఏప్రిల్ 15 నుంచి మే 27 వరకూ ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
5. రైలు నెంబరు 01067. సీఎస్టీ ముంబయి - కరీంనగర్ (ప్రతి మంగళవారం మాత్రమే) ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకూ ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
6. రైలు నెంబరు 01068. కరీంనగర్ - సీఎస్టీ ముంబయి (ప్రతి బుధవారం మాత్రమే) ఏప్రిల్ 10 నుంచి మే 29 వరకూ ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
7. రైలు నెంబరు 06505. యశ్వంత్ పూర్ - కలబురగి (ఒక సోమవారం మాత్రమే) ఏప్రిల్ 8న మాత్రమే ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
8. రైలు నెంబరు 06506. కలబురగి - యశ్వంత్ పూర్ (ఒక మంగళవారం మాత్రమే) ఏప్రిల్ 9న మాత్రమే ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
48 Summer Special trains services#summer #SCR pic.twitter.com/l6A8BJHgZ1
— South Central Railway (@SCRailwayIndia) April 8, 2024