Vijay Deverakonda Rashmika Kiss: రష్మిక చేతికి విజయ్ ముద్దు... పబ్లిక్‌లో ఫస్ట్ టైమ్... ప్రేమను ఇలా చెప్పాడా?
Vijay Deverakonda Rashmika Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం జరిగింది. అయితే అది అఫీషియల్‌గా చెప్పలేదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ పబ్లిక్‌లో కిస్ చేశారు విజయ్. ఆ మూమెంట్ వైరల్ అవుతోంది.

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna)తో రౌడీ బాయ్, సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రేమలో ఉన్న సంగతి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి తెలుసు. ఇంకా ప్రేమలో ఉన్నారని చెప్పడం సరి కాదు ఏమో!? ఈ జంట పెళ్లికి రెడీ అయ్యింది కనుక. ఇటీవల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కుతారని సమాచారం. అయితే ఆ విషయాలు అధికారికంగా వెల్లడించలేదు. తమ ప్రేమను పబ్లిక్‌గానూ చెప్పలేదు. ఫర్ ద టైమ్... పబ్లిక్‌లో రష్మిక చేతికి విజయ్ దేవరకొండ ముద్దు ఇచ్చారు.
రష్మిక చేతికి విజయ్ దేవరకొండ ముద్దు!
రష్మిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. మూవీ సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు. నిజానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం అతడిని తీసుకు రావాలని అల్లు అరవింద్ ట్రై చేశారు. కానీ వేరే సినిమా షూటింగులో విజయ్ ఉండటం వల్ల రాలేకపోయారు. ఇప్పుడు సక్సెస్ మీట్ టైంకి వీలు చేసుకుని వచ్చారు. ఈ ఈవెంట్‌లో రష్మిక చేతికి ఆయన ముద్దు ఇవ్వడం వైరల్ అయ్యింది.
Also Read: మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
View this post on Instagram
ఈ వేడుకలో విజయ్ దేవరకొండ గురించి రష్మిక మాట్లాడారు. అటువంటి అబ్బాయి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలని ఆవిడ ఆకాంక్షించారు. మరో వైపు విజయ్ దేవరకొండ సైతం ఎప్పుడూ తన చుట్టుపక్కల ఉన్న జనాలు ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి రష్మిక అని, ఈ సినిమాతో సంపూర్ణ మహిళగా ఎదిగిన విధానం చూసి గర్వపడుతున్నానని తెలిపారు.
నా జీవితంలోనూ భూమాకు జరిగినట్టు...
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో చూపించిన కొన్ని అంశాలు తన జీవితంలోనూ ఉన్నాయని రష్మిక తెలిపారు. భూమాకు జరిగినట్టు తనకు కూడా జరిగిందని ఆవిడ అన్నారు. అయితే తన జీవితంలో సుధీర్ లాంటి ప్రొఫెసర్ లేడని చెప్పుకొచ్చారు. రాహుల్ రవీంద్రన్ ఒక అబ్బాయి అయ్యుండి ఓ అమ్మాయి జీవితాన్ని అంత బాగా ఎలా అర్థం చేసుకున్నాడని ఎప్పుడూ ఆలోచించేదాన్ని అని రష్మిక ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read: షూటింగ్‌లో గాయం... ఐదారు నెలలు బెడ్ రెస్ట్... హీరోయిన్ చాందినీ చౌదరి ఇంటర్వ్యూ





















