Trains Cancelled: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్, 5 రోజులపాటు పలు రైళ్లు రద్దు- చూసి ప్లాన్ చేసుకోండి
South Central Railway cancels trains | పాపట్‌పల్లి- డోర్నకల్ బైపాస్ మధ్య రైల్వే లైను పనులు జరుగుతున్న కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. కొన్ని పాక్షికంగా రద్దయ్యాయి.

SCR Cancelled Trains | హైదరాబాద్: రైలు ప్రయాణం చేసే వారికి అలర్ట్. ఒకవేళ మీరు ఈ మార్గాలలో ప్రయాణించేవారు అయితే రైళ్ల రద్దుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే చేసిన ప్రకటన తెలుసుకుని జర్నీని ప్లాన్ చేసుకోవాలి. ఐదు రోజులపాటు 10 రైళ్ల సర్వీసులు రద్దు చేసినట్లు ద.మ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
పాపట్‌పల్లి- డోర్నకల్ బైపాస్ మధ్య 3వ రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తనుంది. ఆ రైల్వే పనులు జరుగుతున్న కారణంగా ఐదు రోజులు పాటు 10 రైళ్లు రద్దయ్యాయి. మరో రెండు రైలు సర్వీసులు పాక్షికంగా రద్దయ్యాయి. మరో 26 రైళ్లను సైతం ఒక రోజు, రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు ద.మ.రైల్వే వెల్లడించింది. మరో 9 రైళ్లను దారి మళ్లించననున్న రైల్వే అధికారులు, 3 రైళ్లు ఆలస్యంగా బయల్దేరతాయని పేర్కొన్నారు.
ఆగస్టు 14 నుంచి 5 రోజులపాటు రద్దయిన రైళ్లు ఇవే...
- డోర్నకల్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67767)
- విజయవాడ- డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67768)
- కాజీపేట- డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67765)
- డోర్నకల్- కాజీపేట (ట్రెయిన్ నెంబర్ 67766)
- విజయవాడ- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12713)
- సికింద్రాబాద్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 12714)
- విజయవాడ- భద్రాచలం రోడ్ (ట్రెయిన్ నెంబర్ 67215)
- భద్రాచలం రోడ్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67216)
- గుంటూరు- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12705)
- సికింద్రాబాద్- గుంటూరు (ట్రెయిన్ నెంబర్ 12706)
ఆగస్టు 19వ తేదీ నుంచి కొన్ని రైళ్లు రద్దు
వాల్తేరు డివిజన్ పరిధిలోని పార్వతీపురం, బొబ్బిలి, సీతానగరం సెక్షన్‌లో మూడో లైను నిర్మాణ పనులు చేపడుతున్న కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు సీనియర్ డీసీఎం కె.సందీప్ ఇటీవల తెలిపారు. ఇంకొన్నిటిని రీషెడ్యూల్ చేశగా, మరికొన్నింటి దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 19వ తేదీ నుంచి 27 వరకు విశాఖ- కోరాపుట్ ప్యాసింజర్ (58538), విశాఖ- రాయ్‌పూర్ ప్యాసింజర్ (58528), విశాఖ- భవానిపట్న ప్యాసింజర్ (58504) రద్దు చేశారు. ఆగస్టు 20 నుంచి 28 వరకు కోరాపుట్-విశాఖ ప్యాసింజర్ (58537), రాయ్‌పూర్-విశాఖ ప్యాసింజర్ (58527), భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ (58503)ను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకుగుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243) గుంటూరు నుంచి విజయనగరం వరకు, ఆగస్టు 20 నుంచి 27 వరకూ తిరుగు ప్రయాణంలో రాయగడ- గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244) విజయనగరం నుంచి గుంటూరుకు నడుస్తాయని వెల్లడించారు.
రైలు ప్రయాణంలో ఏమైనా సహాయం కావాలంటే 139కు డయల్ చేయాలని అధికారులు సూచించారు. ట్రెయిన్ జర్నీలో ఏదైనా సమాచారం కావాలన్నా, సహాయంగానీ, ఎమర్జెన్సీ సపోర్ట్ కోసం ఆ నెంబర్ కు కాల్ చేస్తే సాయం అందుతుందని ప్రయాణికులకు డీఆర్ఎం సూచించారు.
Dial 139 for Railway Assistance 🚆📷 Whether you need information, help, or emergency support during your train journey — help is just three digits away! 📷 Quick. Reliable. Always there. #IndianRailways #RailwayHelpline #Dial139 #TravelSafe pic.twitter.com/b2ilviDUVy
— DRM Nanded (@drmned) August 11, 2025






















