Indian Railways: టిక్కెట్లు ఇప్పుడు బుక్ చేసుకోండి, డబ్బులు తర్వాత కట్టండి - రైల్వే ఆఫర్ -ఎలా బుక్ చేసుకోవాలంటే ?
IRCTC: ఇండియన్ రైల్వేస్ సంస్థ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. బుక్ నౌ - పే లేటర్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.

Indian Railways book ticket now and pay later: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 'ఇప్పుడు బుక్ చేసుకోండి, తర్వాత చెల్లించండి' ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ముందస్తుగా డబ్బులు చెల్లించకుండానే టికెట్ పొందవచ్చు, కానీ మొత్తం బుకింగ్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి.
టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?
ముందుగా మీ IRCTC ఖాతాలోకి లాగిన్ అవ్వండి. తరువాత " బుక్ నౌ" వద్ద క్లిక్ చేయాలి.
వేరే పేజీలో క్యాప్చా కోడ్ , ప్రయాణీకుల వివరాలను నమోదు చేయాలి. తర్వాత సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి.
చెల్లింపు సమాచారంతో కూడిన పేజీ కనిపిస్తుంది. మీరు దీని కోసం క్రెడిట్, డెబిట్, BHIM యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. కానీ తర్వాత చెల్లించాలని అనుకుంటే.. ముందుగా నమోదు చేసుకోవాలి. www.epaylater.inలో బుక్ నౌ పే లేటర్ ఆప్షన్ కోసం నమోదు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుని తర్వాత చెల్లించే అవకాశాన్ని కల్పించినట్లుగా మెయిల్ వస్తుంది. టిక్కెట్ గేట్ వేలో ఈ ఆప్షన్ ఎంచుకంటే ముందస్తుగా ఎటువంటి ఖర్చు లేకుండా రైలు టికెట్ అందుతుంది.
టికెట్ రిజర్వేషన్ తర్వాత 14 రోజుల్లోపు చెల్లింపు పూర్తి చేయాలి. ఆలస్యమైన చెల్లింపులకు ప్రయాణీకులకు 3.5 శాతం సర్వీస్ పెనాల్టీ విధిస్తారు. కేటాయించిన సమయ వ్యవధిలోపు చెల్లించేస్తే అదనపు చార్జీలు పడవు.
యాప్‌లో రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో నగదు చెల్లింపు అనేది చాలా సమస్యలకు కారణం అవుతోంది. టిక్కెట్ బుక్ అయిన సమయంలో పేమెంట్ ఫెయిల్ అవుతోంది. పేమెంట్ గెట్ వే కారణంగా టిక్కెట్లు బుక్ కాని సందర్భాలు ఉంటున్నాయి. ఇలాంటి సమస్యలకు కూడా ఈ పే లేటర్ ఆఫర్ సమస్య లను పరిష్కరిస్తుందని అనుకోవచ్చు.
సాధారణంగా మనీ వాలెట్లుతో పాటు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్ లైన్ షాపింగ్ సంస్థలు ఇలాంటి బయ్ నౌ.. పే లెటర్ ఆఫర్లు ఇస్తూ వస్తున్నాయి. అయితే అవి ఇతర ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాయి. కొన్ని కంపెనీలు వడ్డీ వసూలు చేస్తాయి. ఒక వేళ గడువులోపు కట్టకపోతే ఎక్కువ వడ్డీ వేస్తారు. అంటే ఇది క్రెడిట్ కార్డును ఉపయోగించుకున్నట్లే. అంతే క్లారిటీగా సమయానికి పే చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ను .. క్రెడిట్ స్కోర్ బాగా ఉన్న వారికే ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఆఫర్ ఎలిజిబులిటీ ఉందో లేదో ముందుకా చూసుకుని ఆ తర్వాత బుక్ చేసుకునే ప్రయత్ం చేయాలి.
తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ విషయంలో పేమెంట్ కు చాలా ఆలస్యం అవుతుంది,. అలాంటి సమయంలో.. .ఈ పే లేటర్ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది.సింగల్ క్లిక్ తో పేమెంట్ పూర్తి చేసినట్లుగా టిక్కెట్లు ఖరారు చేసుకోవచ్చు.
Also Read: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

