Sigachi Letter On Incident: ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు: మృతుల కుటుంబాలకు సిగాచీ రూ.1 కోటి పరిహారం
పాశమైలారంలో జరిగిన ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు అని సిగాచీ సంస్థ ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సిగాచీ రూ.1 కోటి పరిహారం ప్రకటించారు.

పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కెమికల్స్ లో జరిగిన ప్రమాదంపై కంపెనీ ఎట్టకేలకు స్పందించింది. ఇటీవల తమ కంపెనీలో జరిగిన పేలుడు ప్రమాదంలో 40 మంది మృతి చెందారని సిగాచి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో మరో 33 మంది గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని సిగాచీ యాజమాన్యం తెలిపింది. సిగాచీ ఇండస్ట్రీస్ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
మృతుల కుటుంబాలకు పరిహారం..
తమ కంపెనీలో జరిగిన పేలుడులో మృతిచెందిన వారి ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇస్తామని సిగాచీ బుధవారం నాడు ప్రకటించింది. అన్ని రకాల క్లెయిమ్స్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. గాయపడిన వారికి వైద్య చికిత్సకు ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చింది. 3 నెలల వరకు ప్లాంట్‌లో కార్యకలాపాలు సిగాచీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ప్రమాదానికి సంబంధించి స్టాక్ మార్కెట్లకు వివేక్ కుమార్ లేఖ రాశారు. సిగాచీలో జరిగిన ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రభుత్వ విచారణ చేపట్టిందని, కారణాలపై అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తుట్లు తెలిపారు.

సిగాచీ ప్రమాదంలో మృతుల సంఖ్యపై తేలని లెక్కలు..
పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ లో సోమవారం జరిగిన ప్రమాదంలో 36 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే హాస్పిటల్ లో అంతకంటే ఎక్కువ మృతదేహాలు ఉన్నాయని, తమ వారి డెడ్ బాడీస్ గుర్తించి అప్పగించాలంటూ బాధితుల బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శవాలను సరిగ్గా చూడటం లేదని, మొత్తం ఎంత మంది చనిపోయారో, గాయపడ్డ వారు ఎందరో ఇంకా తేల్చడం లేదని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిగాచి ఇండస్ట్రీస్ షేర్లు బిఎస్‌ఇలో భారీగా పతనం
సోమవారం సిగాచీ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ రోజు ఉదయం 58 రూపాయలు పైగా ఉన్న షేర్లు ఒక్కసారిగా ఇంట్రాడేలో 47.5 రూపాలయలకు పతనమయ్యా్యి. జులై1న సైతం సిగాచీ షేర్ ధర మరో రెండు రూపాయలు తగ్గింది. జులైన బుధవారం నాడు ఇంట్రాడేలో మరో 6.5 శాతం షేర్ ధర పతనమైంది. వార్త రాసే సమయానికి రూ.42.90 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది.
పాశమైలారం సీగాచి పరిశ్రమ యజమాన్యానికి చెందిన ఒకరు పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి వచ్చారు. అనంతరం చిదంబరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సిగాచి పరిశ్రమ ముగ్గురు పార్టనర్ షిప్ లో నడుస్తుంది. 1.అమిత్ రాజ్ సిన్హా MD CEO , 2.చిదంబరం వైస్ చైర్మన్, 3.రవీంద్ర ప్రసాద్ సిన్హా ఛైర్మన్ గా ఉన్నారు.

గతంలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. వైస్ చైర్మన్ చిదంబరం నాథ్
‘గత 35 సంవత్సరాలుగా కంపెనీ నడుపుతున్నాం. ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. ఐదు సంవత్సరాల క్రితం కంపెనీని ఎలాంగో గౌడకు లీజుకు ఇచ్చాము. ప్రస్తుతం సిగాచీ కంపెనీ బాధ్యతలు అతనే చూస్తున్నాడు. ప్రమాదంలో ఎలాంగో గౌడ కూడా మృతి చెందారు. పూర్తివివరాలు మా వద్ద కూడా లేదు. ఎక్స్పర్ట్ పర్సన్స్ తో మాట్లాడి నిర్ణయం తుది తీసుకుంటాం. బాధితులకు న్యాయంగా భారీ పరిహారం చెల్లిస్తాం. అగ్ని ప్రమాదం కేసు విషయం మా కంపెనీ అడ్వకేట్ లు చూసుకుంటారు అని’ చిదంబరం నాథ్ తెలిపారు.























